భారతదేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ‘ఏథర్ ఎనర్జీ’ విక్రయాల్లో అరుదైన మైలురాయిని చేరుకుంది. ఏథర్ ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ రిజ్తా 2,00,000 అమ్మకాల మైలురాయిని దాటిందని కంపెనీ ప్రకటించింది. మే 2025లో 1,00,000 రిజ్తా యూనిట్లను ఏథర్ విక్రయించగా.. ఆరు నెలల తర్వాత ఆ సంఖ్య 2,00,000కు చేరింది. స్కూటర్ లాంచ్ అయిన 20 నెలల్లోనే కంపెనీ ఈ మైలురాయిని సాధించడం విశేషం. ఇది ఒక గొప్ప విజయం అని కంపెనీ పేర్కొంది.…
TVS iQube: TVS మోటార్ కంపెనీ తన iQube ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తాజాగా 2025 వర్షన్‌లో భారత మార్కెట్లో ప్రవేశపెట్టిన సంగతి విధితమే. అయితే, ఇప్పుడు కంపెనీ కొత్తగా 3.1 kWh బ్యాటరీ వేరియంట్‌ను రూ. 1.05 లక్షల (ఎక్స్‌షోరూం) ధరతో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ కొత్త వేరియంట్‌తో iQube స్కూటర్ నాలుగు బ్యాటరీ ఎంపికలతో అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే ఉన్న 2.2 kWh, 3.5 kWh, 5.1 kWh వేరియంట్‌ల మధ్య ఈ 3.1 kWh…
TVS iQube S, ST 2025: టీవీఎస్ మోటార్ కంపెనీ భారతదేశంలో 2025కి సంబంధించి తమ ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్లు TVS iQube S, iQube ST మోడళ్లను అధికారికంగా విడుదల చేసింది. ఈ మోడళ్లలో కీలక మార్పులు జరిగిన నేపథ్యంలో స్కూటర్ల ధరలు కూడా పెరిగాయి. ఇండియన్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్లో మంచి ఆదరణ పొందుతున్న iQube కొన్ని నెలల్లోనే తన సెగ్మెంట్‌లో అత్యధికంగా అమ్ముడైన మోడల్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలోనే తన అప్డేటెడ్…