TVS iQube S, ST 2025: టీవీఎస్ మోటార్ కంపెనీ భారతదేశంలో 2025కి సంబంధించి తమ ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్లు TVS iQube S, iQube ST మోడళ్లను అధికారికంగా విడుదల చేసింది. ఈ మోడళ్లలో కీలక మార్పులు జరిగిన నేపథ్యంలో స్కూటర్ల ధరలు కూడా పెరిగాయి. ఇండియన్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్లో మంచి ఆదరణ పొందుతున్న iQube కొన్ని నెలల్లోనే తన సెగ్మెంట్‌లో అత్యధికంగా అమ్ముడైన మోడల్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలోనే తన అప్డేటెడ్ 2025 మోడల్స్ ను టీవీఎస్ మోటార్ విడుదల చేసింది. మరి వాటి ధర, స్పెసిఫికేషన్స్ వివరాలను ఒకసారి చూద్దామా..
Read Also: KTM Hikes Bike Prices: KTM బైక్ లవర్స్ కు షాక్.. భారీగా బైకుల ధరలను పెంచుతూ నిర్ణయం..!
iQube S స్పెసిఫికేషన్స్:
2025 TVS iQube S రెండు వెర్షన్లలో అందుబాటులో ఉంది. ఇందులో మొదటిది 5 అంగుళాల TFT స్క్రీన్ ఉన్న వెర్షన్ ధర రూ. 1.09 లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా.. 7 అంగుళాల పెద్ద డిస్‌ప్లే ఉన్న వేరియంట్‌కు రూ. 1.17 లక్షలు ధరగా నిర్ణయించారు. ఈ కొత్త మోడల్‌లో 3.3 kWh బ్యాటరీకి బదులుగా 3.5 kWh బ్యాటరీ అందించబడింది. దాంతో ఒక్కసారి చార్జ్ చేస్తే 145 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలము.
iQube ST స్పెసిఫికేషన్స్:
TVS iQube ST కూడా రెండు బ్యాటరీ వేరియంట్లలో లభ్యమవుతుంది. 3.5 kWh బ్యాటరీ ఉన్న వెర్షన్ ధర రూ. 1.28 లక్షలు (ఎక్స్-షోరూమ్). అలాగే, కాస్త పెద్ద బ్యాటరీ ఉన్న వెర్షన్‌లో 5.1 kWh బ్యాటరీ స్థానంలో ఇప్పుడు 5.3 kWh బ్యాటరీ వచ్చింది. దీనితో ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 212 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. ఈ పెద్ద బ్యాటరీ వేరియంట్ ధర రూ. 1.59 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు.
Read Also: Hari Hara VeeraMallu: పవన్ కళ్యాణ్ ఫాన్స్ రెడీగా ఉండండి.. హరి హర వీరమల్లు రిలీజ్ డేట్ ఫిక్స్.!
ఈ కొత్త TVS iQube మోడళ్లలో డిజైన్ పరంగా కూడా కొన్ని మార్పులు చేసారు. బీజ్ కలర్‌లో ఉన్న ఇంటీరియర్ ప్యానల్స్, డ్యూయల్-టోన్ సీట్, పిలియన్ కోసం బ్యాక్ రెస్ట్ వంటి కొత్త ఫీచర్లు అందించబడ్డాయి. టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే ద్వారా టర్న్-బై-టర్న్ నావిగేషన్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ వంటి అడ్వాన్స్డ్ ఫీచర్లు కూడా అందించబడ్డాయి. ఇవి అన్ని మార్పులతో కలిసి 2025 TVS iQube S, ST మోడళ్లు మార్కెట్లో మరింత పోటీదారులుగా నిలవనున్నాయి.