169 కి.మీ రేంజ్, 6.7kW పీక్ పవర్తో ఈవీ మార్కెట్లో అడుగుపెట్టిన Yamaha EC-063
- భారత్ ఎలక్ట్రిక్ వాహన మార్కెట్‌లోకి అడుగు పెట్టిన యమహా..
- తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ Yamaha EC-06ను భారత మార్కెట్లో లాంచ్..
- భారీ రేంజ్, ప్రీమియం ఫీచర్లతో Yamaha EC-06 ఎలక్ట్రిక్ స్కూటర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yamaha EC-06: భారత్ ఎలక్ట్రిక్ వాహన మార్కెట్‌లోకి Yamaha అధికారికంగా అడుగు పెట్టింది. కంపెనీ తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ Yamaha EC-06ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ స్కూటర్ ధరను రూ.1,67,600 (ఎక్స్-షోరూమ్)గా కంపెనీ నిర్ణయించింది. అయితే, ప్రారంభ దశలో ఈ స్కూటర్‌ను ఎంపిక చేసిన నగరాల్లోని Yamaha ప్రీమియం బ్లూ స్క్వేర్ షోరూమ్‌ల ద్వారా మాత్రమే విక్రయించనున్నారు. ఇది యమహా ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రయాణంలో ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని సంస్థ పేర్కొంది. ఈ స్కూటర్ River Indie ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకుని రూపొందించబడింది.
Read Also: Tvk Vijay : వెనక్కి తగ్గిన జననాయగన్ మేకర్స్.. మరోసారి సెన్సార్
Also Read
- Electric Two-Wheeler Sales: మార్కెట్‌ను శాసిస్తున్న 4 ఈవీ స్కూటర్లు ఇవే.. 9 నెలల్లో 15.61 లక్షల అమ్మకాలు..!
- Porsche Cayenne Electric: Porsche Cayenne Electric భారత్‌లో లాంచ్.. 623 కి.మీ రేంజ్, 2.5 సెకన్లలో 100 kmph
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
- Yamaha R15 లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. నిలిపివేయాలని కంపెనీ ప్లాన్..
బ్యాటరీ:
* Yamaha EC-06లో అంతర్గత శాశ్వత అయస్కాంత సమకాలిక మోటార్ (IPMSM)ను ఉపయోగించారు. దీంతో పాటు 4kWh ఫిక్స్‌డ్ బ్యాటరీ అందించారు. అయితే, సాధారణ ఇంటి ప్లగ్‌తోనే ఛార్జింగ్ సౌకర్యం ఉండగా, పూర్తి ఛార్జ్ కావడానికి సుమారు 8 గంటల సమయం పడుతుంది. ఒక్కసారి పూర్తి ఛార్జ్‌తో ఈ స్కూటర్ 169 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అందిస్తుంది. ఇది రోజువారీ నగర ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది.
* 6.7kW పీక్ పవర్
* 26Nm టార్క్
* 79 కిలోమీటర్ల గరిష్ట వేగం
డిజైన్ & హార్డ్‌వేర్:
* ప్రారంభంలో Yamaha EC-06ను ఒకే ఒక Bluish White రంగులో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ స్కూటర్‌ను భారత్‌లోనే డిజైన్ చేసినప్పటికీ, గ్లోబల్ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి చేసినట్లు యమహా తెలిపింది. స్టైలిష్, ప్రాక్టికల్ అండ్ పర్యావరణహితమైన కమ్యూటింగ్ కోసం ఇది రూపొందించబడింది. ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండింటికీ 200 మిల్లిమీటర్ల డిస్క్ బ్రేకులు అందించారు. అదనంగా Combi Brake System (CBS) ద్వారా సురక్షితమైన బ్రేకింగ్ అందుతుంది. ఇక, ఈ స్కూటర్‌లో LED హెడ్‌లైట్స్, టెయిల్‌లైట్స్ ఉండటం వల్ల రాత్రి సమయంలో మెరుగైన విజిబిలిటీతో పాటు ప్రీమియం లుక్‌ను అందజేస్తాయి.
Yamaha EC-06: ఫీచర్లు:
* వివిధ రైడింగ్ అవసరాలకు అనుగుణంగా ఈ స్కూటర్‌లో మూడు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. ఇవి సమర్థవంతమైన రేంజ్, సమతుల్య పనితీరు లేదా వేగవంతమైన యాక్సిలరేషన్‌ను ఎంపిక చేసుకునే అవకాశాన్ని ఇస్తాయి. ఇరుకైన ప్రదేశాల్లో స్కూటర్‌ను తిప్పుకోవడానికి సహాయపడేలా Reverse Mode కూడా ఉంది. అలాగే, సస్పెన్షన్ విషయంలో, ముందు భాగంలో హైడ్రాలిక్ డ్యాంపర్లతో టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక భాగంలో కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్ అందించారు. అదనంగా, కలర్ LCD డిస్‌ప్లే ద్వారా స్పీడ్, బ్యాటరీ స్టేటస్, రైడింగ్ మోడ్‌లు, కనెక్టివిటీ వివరాలను చూడవచ్చు.
* Eco Mode
* Standard Mode
* Power Mode
ధర:
అయితే, భారత మార్కెట్లో Yamaha EC-06 ఎక్స్-షోరూమ్ ధర రూ.1,67,600గా ఉంది.
* River Indie
* Ather 450X
* Ola S1 Pro
* Suzuki e-Access వంటి ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్లతో పోటీ పడనుంది. భారత్‌లో యమహా ఎలక్ట్రిక్ వాహనాల ప్రయాణం EC-06తో ప్రారంభం కావడంతో.. రానున్న రోజుల్లో మరిన్ని ఎలక్ట్రిక్ మోడళ్లకు తీసుకొచ్చేందుకు కంపెనీ రెడీ అవుతుందని ఆటో రంగ నిపుణులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
AP: వారంలో ఆరు రోజులు గుడ్లు, మూడ్రోజులు చికెన్.. విద్యార్థులకు చంద్రబాబు సర్కార్ దసరా గిఫ్ట్!
-
OTR: కూటమి ఎమ్మెల్యేలకు రెడ్ అలర్ట్! 95 మంది డేంజర్ జోన్లో ఉన్నారా?
-
OTR: సీఎం టూర్లో బయటపడ్డ కాంగ్రెస్ విభేదాలు
-
Nara Lokesh: నెల రోజుల్లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్.. ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి లోకేష్!
-
Maharashtra Tragedy: బీచ్ ట్రిప్‌లో విషాదం.. నీటిలో మునిగి 8 మంది స్టూడెంట్స్ మృతి..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?