TVS iQube: TVS మోటార్ కంపెనీ తన iQube ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తాజాగా 2025 వర్షన్‌లో భారత మార్కెట్లో ప్రవేశపెట్టిన సంగతి విధితమే. అయితే, ఇప్పుడు కంపెనీ కొత్తగా 3.1 kWh బ్యాటరీ వేరియంట్‌ను రూ. 1.05 లక్షల (ఎక్స్‌షోరూం) ధరతో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ కొత్త వేరియంట్‌తో iQube స్కూటర్ నాలుగు బ్యాటరీ ఎంపికలతో అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే ఉన్న 2.2 kWh, 3.5 kWh, 5.1 kWh వేరియంట్‌ల మధ్య ఈ 3.1 kWh మోడల్‌ను మిడిల్ రేంజ్ వేరియంట్‌గా తీసుకవచ్చారు.
Read Also:CM Chandrababu: సీబీఎన్ 14 కాదు.. సీబీఎన్ 95 ఇక్కడ.. తప్పుచేస్తే తోక కట్ చేస్తా..!
3.1 kWh వేరియంట్ ప్రత్యేకతలు:
ఈ మోడల్ గరిష్ఠంగా 82 కిమీ/గంట వేగంతో నడవగలదు. ఒకసారి పూర్తిగా చార్జ్ చేస్తే 121 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. 0 నుంచి 80 శాతం చార్జ్‌కి 4 గంటల 30 నిమిషాలు పడుతుందని కంపెనీ తెలిపింది. ఈ వేరియంట్ బరువు 117 కేజీలు గా ఉంటుందని కంపెనీ పేర్కొంది.
iQube స్కూటర్‌లో ఇదివరకు లాగే ట్యూబులర్ ఫ్రేమ్, ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక భాగంలో ట్విన్ ట్యూబ్ షాక్స్ ఉన్నాయి. బ్రేకింగ్ వ్యవస్థలో ముందు భాగంలో 220mm డిస్క్ బ్రేక్, వెనుక భాగంలో 130mm డ్రమ్ బ్రేక్ ఉన్నాయి. మిగతా వేరియంట్ల మాదిరిగానే, ఇందులో కూడా TFT స్క్రీన్, బ్లూటూత్ కనెక్టివిటీ ఉన్నాయి. అయితే ఇందులో యాంత్రికంగా మార్పులేమీ చేయలేదు.
ఈ టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ 2.2 kWh వేరియంట్ ధర రూ. 94,434 (ఎక్స్‌షోరూం). ఇప్పుడు తీసుకొచ్చిన 3.1 kWh వేరియంట్ ధర రూ. 1.05 లక్షలు. ఇక టాప్ వేరియంట్ 5.1 kWh బ్యాటరీతో రూ 1.58 లక్షలుగా కంపెనీ పేర్కొనింది. ఈ టాప్ వేరియంట్ ఒకే చార్జ్‌తో 212 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. 0–80% చార్జ్‌కి 4 గంటలు 18 నిమిషాల సమయం పడుతుంది. ఈ కొత్త 3.1 kWh వేరియంట్‌తో, TVS iQube మరింత విస్తృత శ్రేణిలో వినియోగదారులకు ఎంపికల్ని అందిస్తోంది. మధ్యస్త ధర, మంచి రేంజ్, వేగంతో ఈ వేరియంట్ యువతకు ప్రత్యేకంగా ఆకర్షణీయంగా నిలవనుంది.