Breaking News: లోక్‌సభ ఎన్నికల ముందు రాజకీయంగా చర్చనీయాంశంగా మారిన ఎలక్టోరల్ బాండ్ స్కీమ్‌పై ఈ రోజు సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ పథకంపై దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
ఎలక్టోరల్ బాండ్ల పథకం ప్రపంచంలోనే అతిపెద్ద దోపిడీ రాకెట్ అని, ప్రధాని నరేంద్ర మోడీకి ‘బ్రెయిన్‌చైల్డ్’ అని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ శుక్రవారం ఆరోపించారు. తన 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' చివరి దశలో ఉన్న రాహుల్ గాంధీ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఈ పథకం ద్వారా పొందిన నిధులను శివసేన, ఎన్సీపీ వంటి పార్టీలను విభజించి, ప్రభుత్వాలను పడగొట్టడానికి ఉపయోగించారని పేర్కొన్నారు.
ఎలక్టోరల్ బాండ్ స్కీమ్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పందించింది. రాజకీయ పార్టీలకు ఎన్నికల విరాళాల మూలాన్ని తెలుసుకునే హక్కు ప్రజలకు లేదని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి అన్నారు.