Heatwave: వేసవి ఎండలు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ మాసం రాకముందే దేశంలోని చాలా ప్రాంతాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ ఏడాది వేసవి కాలంలో వేడిగాలులు, ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనా వేసిన నేపథ్యంలో ఓటర్ల భద్రత కోసం లోక్‌సభ ఎన్నికల ముందు భారత ఎన్నికల సంఘం(ఈసీ) ఈరోజు కీలక సూచనలు జారీ చేసింది.