యువీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ లో దర్శకుడు మారుతి రూపొందిస్తున్న కొత్త సినిమా ‘మంచి రోజులు వచ్చాయి’. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్, ‘సోసోగా ఉన్నా’ పాటకు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి ‘ఎక్కేసిందే…’ అనే లిరికల్ సాంగ్ విడుదలైంది. రామ్ మిరియాల ఈ పాట పాడారు. అనూప్ రూబెన్స్ ట్యూన్ అందించారు. ఈ పాటకు చక్కని స్పందన లభిస్తోందని దర్శక నిర్మాతలు తెలిపారు.…