ఈద్-ఉల్-అఝా(బక్రీద్) పర్వదినం సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముస్లి సోదరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ త్యాగం, అంకితభావం, అల్లాహ్‌పై అచంచల విశ్వాసానికి ప్రతీక అని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు. ఈద్-ఉల్-అఝా పండుగ మనం కలిసి జీవించడానికి, సామాజిక సామరస్యాన్ని కాపాడుకోవడానికి ప్రేరేపిస్తుందని ముఖ్యమంత్రి అన్నారు.
Pakistan: పాకిస్తాన్ దేశం బలూచిస్తాన్ ప్రావిన్సులోని జైలు నుంచి 17 మంది ఖైదీలు పరారయ్యారు. ఈద్ ఉల్ అదా(బక్రీద్) పండగ సమయంలో వీరంతా పక్కా ప్లాన్ తో జైలు నుంచి పారిపోయారు. ఈ ఘటన బలూచిస్తాన్ లోని చమన్ జైలులో జరిగింది.
Pakistan: పాకిస్తాన్ దేశంలో ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తోంది. ఇటీవల కాలంలో మేకలు, ఇతర పశువుల దొంగతనాలు పెరగుతున్నాయి. ముస్లింలకు పవిత్ర పండగ బక్రీద్(ఈద్ ఉల్ అధా) సమీపిస్తున్న సమయంలో జంతువులను బలిచ్చేందుకు చాలా మంది దొంగతనాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్ ఆర్థిక రాజధాని కరాచీలో ఇటీవల కాలంలో ఇటువంటి నేరాలు ఎక్కువగా పెరిగాయి. వేలు, లక్షల్లో విక్రయించబడుతున్న జంతువులను అమ్మేందుకు వెళ్తున్న వారిని టార్గెట్ చేసుకుని వాటిని దొంగిలిస్తున్నారు.