Etela Rajender : బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాసిన లేఖ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. గులాబీ పార్టీలో ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈటల మాట్లాడుతూ, కేసీఆర్ ఒకరిపై నెగటివ్ అభిప్రాయం పెంచుకుంటే ఇక ఆయనను ఒప్పించటం అసాధ్యమని అన్నారు. కవిత విషయంలోనూ ఇదే జరిగింది…
రాష్ట్రంలో బీజేపీ నాయకులను గెలిపించినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు ఈటల రాజేందర్. ఇవాళ ఆయన బీజేపి రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో అభివృద్ధి కావాలంటే బీజేపీ ఎంపీ అభ్యర్థులు ఉండాలని మమ్మల్ని గెలిపించారన్నారు. అనూహ్యంగా 35 శాతానికి పెరిగిన ఓటు బ్యాంక్ పెరిగిందని, అధికార పార్టీ డబ్బులతో ప్రలోభాలు పెట్టిందని, అయినా వారికి ఓటు బ్యాంక్ పెరగలేదన్నారు ఈటల రాజేందర్. ఈ ఎన్నికలు ఫలితాలు చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీ దే అధికారం…
వచ్చే నెలలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ వేదికైన తరుణంలోనే ఒక్కసారిగా చర్చల్లోకి వచ్చారు ఎమ్మెల్యే ఈటల రాజేందర్. 2, 3 తేదాల్లో జరిగే సమావేశాల ఏర్పాట్లలో ఈటలకు కూడా బాధ్యతలు అప్పగించింది పార్టీ. కానీ.. కొన్నాళ్లుగా బీజేపీలో తనకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదనే భావనలో మాజీ మంత్రి ఉన్నట్టు టాక్. ముందరి కాళ్లకు బంధాలేస్తున్నారనే ఫీలింగ్‌లో ఉన్నారట. బీజేపీలోని కొందరు నాయకుల వైఖరి పట్ల కినుకతో ఉన్నట్టు చెబుతున్నారు. దాంతో బీజేపీలో ఈటల…
గన్ పార్క్ లో తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్ రావు. నిర్బంధపాలన నశించాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కేసీఆర్ తీరుపై మండిపడ్డారు. ప్రజాసంక్షేమ విధాన పత్రమే గవర్నర్ ప్రసంగం. దీనిమీద చర్చించడం ఎమ్మెల్యే గా మా హక్కు. కానీ సీఎం కేసీఆర్ 40 సంవత్సరాలుగా వస్తున్న విధానాన్ని తుంగలో తొక్కి ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేశారు. గవర్నర్ కే…
ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన హుజురాబాద్ పోలింగ్ పోరు ముగిసింది. గెలుపెవరిదినే దానిపై టెన్షన్ నెలకొంది. ఎవరికి వారే తమ అంచనాలు వేసుకుంటున్నారు. హుజురాబాద్ ఫలితం మాత్రం తెలంగాణ రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులు తేవడం ఖాయంగా కనిపిస్తోంది. ఎవరు గెలిస్తే వారికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. ఎగ్జిట్ పోల్స్ లో మాత్రం ఈటల వైపు మొగ్గు కనిపిస్తోందంటున్నారు. అన్ని పార్టీలు హుజురాబాద్ ఉపఎన్నికలను 2023లో జరగబోయే ఎన్నికలకు ప్రయోగంగా భావిస్తున్నారు. ఒక్క ఎమ్మెల్యే…
హుజురాబాద్ ఉప ఎన్నికకు సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఆదివారం వీణవంక మండలంలో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ఎన్నికల క్యాంపెయిన్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన టీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేశారు. ప్రజలను భయపెట్టి ఓట్లు దండుకునేందుకు టీఆర్ఎస్ పార్టీ కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. హుజురాబాద్‌లో తన గెలుపును ఎవరూ అడ్డుకోలేరని ఈటెల ధీమా వ్యక్తం చేశారు. తనకు మద్దతు ఇచ్చినా, బీజేపీకి ఓటు వేసినా…