ఈటల రాజేందర్ జాయినింగ్ పై బిజెపి రాష్ట్ర నేతల క్లారిటీ ఇచ్చారు. ఈటల చేరికపై ఢిల్లీ పెద్దలతో మాట్లాడిన బండి సంజయ్.. ఉద్యమకారులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఢిల్లీ పెద్దలకు చెప్పారు. ఉద్యమకారులకు కచ్చితంగా బిజెపి ప్రాధాన్యత, తగిన గౌరవం కూడా ఇస్తుందని బండి సంజయ్ కి చెప్పారు ఢిల్లీ పెద్దలు. ఈటల రాజేందర్ చేరికపై రాష్ట్ర నేతల అభిప్రాయాలు తీసుకున్న బండి సంజయ్..ఈటలను బిజెపిలో చేర్చుకోవాలని ఏకగ్రీవంగా తమ అభిప్రాయాన్నిచెప్పారు రాష్ట్ర బిజెపి ముఖ్య నేతలు.…
ఈటలపై మరోసారి మంత్రి గంగుల కమలాకర్ ఫైర్ అయ్యారు. తెలంగాణలో 15 రోజులుగా అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయన్నారు. ఈటెల రాజేందర్ మీద ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రజలు ఫిర్యాదులు చేశారని..వెంటనే ముఖ్యమంత్రి విచారణకు ఆదేశించడం ఈటెలను మంత్రి వర్గం నుండి బర్తరఫ్ చేయడం జరిగిందని పేర్కొన్నారు. హుజురాబాద్ నాయకులను ప్రజా ప్రతినిధులను డబ్బులిచ్చి కొంటున్నారు అంటూ ఈటల అనడం బాధాకరమని..టిఆర్ ఎస్ పార్టీ తరపున ఎన్నికైన ప్రజా ప్రతినిధులు అమ్ముడుపోయారు అనడం బాధ కలిగిందన్నారు. టిఆర్ఎస్…
ఈటలకు మరో షాక్ తగిలింది. జమ్మికుంట మున్సిపాలిటీ చైర్మన్ తక్కలపెల్లి రాజేశ్వరరావు, ఎంపీపీ దొడ్డే మమతతో పాటు 12 మంది కౌన్సిలర్లు, గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు సింగిల్విండో చైర్మన్ లు నాయకులు టీఆర్ఎస్ పార్టీ నిర్ణయానికి కట్టుబడి కెసిఆర్, కేటీఆర్ నాయకత్వంలో పని చేస్తామని ప్రకటించారు. ఈ సందర్బంగా మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించడంతో తెలంగాణను సాధించుకున్నామన్నారు. సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమంలో…
మాజీ మంత్రి ఈటలకు వరుసగా షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే హుజూరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కీలక నేతలు టీఆర్ఎస్ లోనే ఉంటామని ప్రకటించగా.. తాజాగా మంత్రి గంగులను శనిగరం, మర్రిపల్లిగూడెం ప్రజాప్రతినిధులు కలిసి ఈటలకు షాక్ ఇచ్చారు. మంత్రి గంగులను కలవడమే కాకుండా.. తమ గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై మంత్రి గంగులకు వినతి పత్రం అందజేశారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఈ సందర్బంగా మంత్రి గంగుల హామీ ఇచ్చారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటుందని…
సిఎం కెసిఆర్ కు మాజీ మంత్రి ఈటల రాజేందర్ చురకలు అంటించారు. తన ఉనికిని దెబ్బ తీసేందుకు కెసిఆర్ సర్కార్ చాలా దౌర్జన్యాలకు పాల్పడుతుందని ఆయన ఫైర్ అయ్యారు. గొర్రెల మంద మీద తోడేళ్ళు దాడి చేసినట్లు దాడి చేస్తున్నారని నిప్పులు చెరిగారు. తెలంగాణకు చైతన్యాన్ని నింపిన గడ్డ మీద కుట్ర చేస్తున్నారని…తెలంగాణ ఉద్యమంకు సంబంధం లేని వ్యక్తి ఇప్పుడు మంత్రిగా బెదిరింపులకు దిగుతున్నారని గంగుల కమలాకర్ రావును టార్గెట్ చేశారు ఈటల. ఎన్ని కుట్రలు చేసినా..…
తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ భూకబ్జా వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ లో ఓనర్ల పంచాయతీ, జీతగాళ్ల పంచాయతీ బయట పడిందని..ఈటల డిమాండ్ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరిపించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలపై కూడా విచారణ జరపాలని..కరోనాతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు…ప్రభుత్వం చేతులెత్తేసిందని ఫైర్ అయ్యారు. సీఎం స్పందించడం లేదని.. ప్రజల దృష్టి మరల్చడానికే ఈ…