మునుగోడు ఎన్నికల గుర్తులపై టీఆర్ఎస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. అత్యవసర విచారణకు నిరాకరించిన హైకోర్ట్.. నేడు విచారణ జరుపుతామని చెప్పింది.
మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రేపై తిరుగుబాటు జెండా ఎగురవేసి.. అందినకాడికి ఎమ్మెల్యేలను లాక్కెళ్లిన ఏక్నాథ్ సిండే.. ఆ తర్వాత బీజేపీతో చేతులు కలిపి ఏకంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు.. శివసేనలో రెబల్ వర్గంగా కొనసాగుతున్నారు.. తమదే అసలైన శివసేన అంటున్నారు.. అయితే, అంధేరి ఈస్ట్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక నేపథ్యంలో.. ఇప్పుడు ఎన్నికల గుర్తులు తెరపైకి వచ్చాయి.. ఇప్పటికే శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం తమ ఆప్షన్లను ఈసీకి సమర్పించింది. మూడు గుర్తులు ఎంచుకుంది.. త్రిశూలం, ఉదయించే సూర్యుడు,…
Telangana Young Voters: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 18-19 ఏళ్ల మధ్య వయసు ఓటర్ల సంఖ్య లక్షా 36 వేల 496 మాత్రమే. అయితే ఈ సంఖ్య త్వరలోనే రికార్డు స్థాయిలో ఏకంగా ఎనిమిది రెట్లు పెరగనుంది. తద్వారా 10 లక్షల మార్కును చేరుకోనుంది.
మనదేశంలో ఓటర్ జాబితా పేరు నమోదు చేసుకుని ఓటరు కార్డు పొందాలంటే 18 ఏళ్లు నిండే వరకు వేచి చూడాల్సిందే. ఇకపై ఓటరు కార్డు దరఖాస్తు చేసుకునేందుకు ఉన్న కనీస వయస్సుపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 17 ఏళ్లుపైబడిన యువత ఓటరు జాబితాలో పేరు నమోదుకు ముందస్తుగా దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పిస్తున్నట్లు పేర్కొంది.
దేవేందర్గౌడ్ అంటే అప్పట్లో తెలుగుదేశం పార్టీలో నంబర్-2 అనే టాక్ ఉండేది. ఆరోగ్యంతోపాటు వివిధ కారణాల వల్ల చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆయన పేరు ఇప్పుడు అనూహ్యంగా తెర మీదికి వచ్చింది. ఎందుకంటే దేవేందర్గౌడ్ అప్పుడెప్పుడో పెట్టి తీసేసిన పొలిటికల్ పార్టీని లేటెస్టుగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా(ఈసీఐ) తన లిస్టు నుంచి డిలీట్ కొట్టింది. ఆ పార్టీ పేరు నవ తెలంగాణ పార్టీ. నిజానికి ఆ పార్టీ పేరు మొదట్లో ఇదే. కానీ…