పశ్చిమ బెంగాల్ ఎస్.ఐ.ఆర్ ప్రక్రియలో జరుగుతున్న వివాదం ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. ఈ వ్యవహారంపై దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఎస్.ఐ.ఆర్ పరిధిలోకి వచ్చే ఓటర్ల పేర్లను బహిరంగంగా ప్రదర్శించాలని భారత ఎన్నికల సంఘాన్ని (ECI) అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ముఖ్యంగా ఎస్.ఐ.ఆర్ పరిధిలోకి వస్తారంటూ ఎవరికైతే నోటీసులు జారీ చేయబడ్డాయో, అటువంటి వ్యక్తుల జాబితాలను సంబంధిత గ్రామ పంచాయతీలు,…