ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్ జిల్లాలో ప్రమాదవశాత్తు డ్రై ఐస్ తిని మూడేళ్ల బాలుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుశాంత్ సాహు మూడేళ్ల కుమారుడు తన కుటుంబంతో సహా రాజేందాంగ్ ప్రాంతంలో ఓ వివాహానికి హాజరయ్యారు. వివాహ వేడుకలో నిర్వాహకులు స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం డ్రై ఐస్‌ను ఓ చోట వాడారు. అయితే అది ఐస్ క్రీం అనుకోని ఓ మూడేళ్ళ బాలుడు డ్రై ఐస్ తిన్నాడు. అనంతరం బాలుడు అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు…