ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్ జిల్లాలో ప్రమాదవశాత్తు డ్రై ఐస్ తిని మూడేళ్ల బాలుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుశాంత్ సాహు మూడేళ్ల కుమారుడు తన కుటుంబంతో సహా రాజేందాంగ్ ప్రాంతంలో ఓ వివాహానికి హాజరయ్యారు. వివాహ వేడుకలో నిర్వాహకులు స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం డ్రై ఐస్‌ను ఓ చోట వాడారు. అయితే అది ఐస్ క్రీం అనుకోని ఓ మూడేళ్ళ బాలుడు డ్రై ఐస్ తిన్నాడు. అనంతరం బాలుడు అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే ద్రువదృష్టశాత్తు చికిత్స పొందుతూ ఆ చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
Also Read: Pawan Kalyan: వైసీపీని ఓడించి తగ్గేది లేదని మెగా ఫ్యాన్స్ నిరూపించాలి..
ఈ మధ్య గురుగ్రామ్ లోని ఒక కేఫ్‌లో జరిగిన సంఘటనలో మౌత్ ఫ్రెషనర్ గా డ్రై ఐస్ ను తిన్న ఐదుగురు వ్యక్తులు ఆసుపత్రి పాలయ్యారు. ఆ సంఘటనలో బాధితులు తన నోటి మంటతో రక్తం వాంతులు చేసుకున్నారు. కాబట్టి ఇటువంటి పదార్థాలు ఉన్న చోట పిల్లలను కాస్త దూరంగా ఉంచితే మనకి మంచిది. లేకపోతే ఇలాంటి దారుణాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.