Turkey : ప్రపంచంలోని అనేక నగరాలను అతలాకుతలం చేయడంలో భూకంపాలు ప్రధాన పాత్ర పోషించాయి. అయితే భూకంపం కారణంగా ఒక ఇల్లు కూలిపోయిన తర్వాత టర్కీ కఠినమైన నిర్ణయం తీసుకుంది.
Earth Quake: నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో భారీ భూకంపం వచ్చింది. ఈరోజు ( జనవరి 7) ఉదయం ఇక్కడ భూకంపం సంభవించడంతో రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.1గా రికార్డు అయింది. ఇప్పటి వరకు సుమారు 36 మంది చనిపోయిగా.. మరో 32 మందికి గాయాలు.
అస్సాంలో వరదల బీభత్సం.. 15కి చేరిన మరణాల సంఖ్య అస్సాంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదలతో తాజాగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో వరదల్లో మరణించిన వారి సంఖ్య 15కి పెరిగిందని.. ప్రభావిత జనాభా సంఖ్య ఆరు లక్షలకు పైగా పెరిగిందని అధికారిక బులెటిన్ శనివారం తెలిపింది. శుక్రవారం నాటికి 11 జిల్లాల్లో బాధితుల సంఖ్య 3.5 లక్షలు అని పేర్కొంది. అయితే.. ప్రభావిత జిల్లాల సంఖ్య 10కి తగ్గిందని అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ…
నిజామాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో ఇవాళ ఉదయం భూకంపం చోటు చేసుకుంది. రిక్టర్ స్కేల్ పై 3.1 తీవ్రత నమోదైంది. భూమి కంపించడంతో.. ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
భారత దేశంతో పాటు వివిధ దేశాలలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. కాశ్మీర్, నోయిడాలో భూప్రకంపనలు సంభవించాయి. ఈ భూప్రకంపనలతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.రిక్టర్ స్కేలుపై 5.7 తీవ్రత నమోదైంది. ఆస్తి, ప్రాణనష్టం వివరాలు తెలియాల్సి వుంది. ఇటు ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో కూడా 3.6 తీవ్రతతో భూమి కంపించింది. మనదేశంతో పాటు అఫ్గానిస్థాన్- తజికిస్థాన్ సరిహద్దులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. దీని ప్రభావం భారత్లోని కశ్మీర్, నోయిడా సహా ఇతర…
ఈమధ్యకాలంలో దేశంలో వివిధ ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సాధారణం అయిపోయాయి. తాజాగా తమిళనాడులోని వెల్లూరు భూప్రకంపనలతో వణికింది.ఐదు నిమిషాల వ్యవధిలో రెండు సార్లు భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు. భూకంప ప్రభావంతో జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.గుడియాతమ్ప్రాంతంలో భూమి కంపించింది. నెల రోజుల వ్యవధిలోనే భూకంపం రావడం ఇది మూడోసారి అని స్థానికులు తెలిపారు. వెల్లూరులో గత నవంబర్ 29న భూప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 3.6గా నమోదైంది. అలాగే రిక్టర్…
గుంటూరు జిల్లాలోని పులిచింతల సమీపంలో ఆదివారం ఉదయం భూప్రకంపనలు వచ్చాయి. ఈరోజు ఉదయం 7:15 గంటల నుంచి 8:20 గంటల మధ్యలో మూడుసార్లు భూమి కంపించింది. భూకంపలేఖినిపై దీని తీవ్రత 2.3,2.7,3 గా నమోదయింది. పులిచింతలతో పాటుగా తెలంగాణలోని చింతలపాలెం, మేళ్లచెరువు మండలాల్లోనూ, సూర్యపేటలోనూ స్వల్పంగా భూమి కంపించినట్టు ఎన్‌జీఆర్ఐ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమిలోపల పొరల్లో వస్తున్న మార్పుల కారణంగా భూప్రకంపనలు కలుగుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. Read: “పాగల్” టైటిల్ వీడియో సాంగ్ రిలీజ్
భూకంపం వచ్చినపుడు భవనాలు ఊగిపోతుంటాయి. నేలమట్టం అవుతుంటాయి. ఆకాశాన్ని తాకే భవనాల్లో ఉండే ప్రజలు భూకంపం వచ్చినపుడు బయటకు పరుగులు తీస్తుంటారు. భూకంపం నుంచి తట్టుకునే విధంగానే పెద్ద పెద్ద భవనాలను నిర్మిస్తుంటారు. అయితే, చైనాలోని షెన్ జెన్ నగరంలో ఉన్న 72 అంతస్తుల సెగ్ ప్లాజా భవనం ఉన్నట్టుండి ఊగిపోయింది. భూకంపం వచ్చిన సమయంలో ఎలాగైతే భవనాలు ఊగిపోతాయో అలా ఊగిపోయింది. దీంతో ఆ భవనంలో పనిచేస్తున్న ఉద్యోగులను హుటాహుటిన బయటకు పంపించారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో భవనం ఊగిపోవడంతో మొత్తం ఉద్యోగులను…