ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లిలో వైసిపి నేత గంజి ప్రసాద్ హత్య రాష్ట్రంలో కలకలం రేపింది. అధికారపార్టీలో ఆధిపత్యపోరు చర్చకు వచ్చింది. నిందితులను వదిలిపెట్టేది లేదని హోంమంత్రి తానేటి వనిత ప్రకటించినా.. క్షేత్రస్థాయిలో పోలీసుల పనితీరుకు మంత్రి స్టేట్‌మెంట్‌కు పొంతన ఉండటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిందితులను అరెస్ట్ చేసినా.. రాజకీయ ఒత్తిళ్లతో విచారణ ముందుకెళ్లడం లేదని పార్టీలోని ఒక వర్గం ఆరోపిస్తోంది. దానికితోడు నిందితులతో పోలీసులు వ్యవహరిస్తున్న తీరును ప్రశ్నిస్తున్నారు నాయకులు. రిమాండ్‌లో ఉన్న…
ఒక్కోసారి చిన్నచిన్న పొరపాట్లు జరుగుతుంటాయి. కొంతమంది దేవాలయాలకు చందాలు, విరాళాలు ఇస్తుంటారు. ఒక వ్యక్తి ఇచ్చిన విరాళం తక్కువే అయినా, కోట్లలో విరాళం ఇచ్చినట్టు దేవస్థానం రికార్డుల్లో నమోదైంది. ఏలూరు జిల్లాలోని ద్వారకా తిరుమలలోని వేంకటేశ్వరస్వామి దేవస్థానానికి శ్రీవారి నిత్య అన్నదానం ట్రస్టుకు. రూ. 2116 చెల్లించాడో భక్తుడు. కానీ రూ 8.కోట్లకు పైగా ఇచ్చినట్టు ఆన్ లైన్లో ఎంటర్ చేశాడో ఉద్యోగి. ఆ తప్పు సరిదిద్దుకునేందుకు ఆలయ అధికారులు నానా తిప్పలు పడుతున్నారు. ఏలూరు జిల్లా…
ప్రేమ ఆరెండు అక్షరాలు ఎంత దారుణానికైనా ఒడిగట్టే పరిస్థుతులు తీసుకొస్తాయి. ప్రేమ పేరుతో కొందరు త్యాగం చేయడానికైనా సిద్దపడుతుంటే మరొకొందరు ప్రాణాలు సైతం తీయడానికి వెనుకాడటం లేదు. మరి కొందరు ప్రియురాలిని సొంతం చేసుకునేందుకు ఎంతటి ఘాతకానికైనా తలపడుతున్నారు. అలాంటి సంఘటనే వెలుగులోకి వచ్చింది. ప్రియురాలి వివాహాన్ని చెడగొట్టేందుకు ఆమెతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు, చాటింగ్, వాయిస్ మెసేజ్‌లను కాబోయే భర్తకు వాట్సాప్‌లో పంపాడు ఆమె ప్రియుడు. దీంతో మనస్తాపానికి గురైన నవ వధువు ఆత్మహత్య…
ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం జి.కొత్తపల్లి గ్రామ వైసీపీ అధ్యక్షుడు గంజి ప్రసాద్ హత్య తీవ్ర కలకలం రేపింది. ఈ హత్య కారణంగా జి.కొత్తపల్లిలో పోలీసుల రెండు వారాల పాటు 144 సెక్షన్ విధించారు. గ్రామంలో 8 పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. 150 మంది పోలీసులు మోహరించారు. ఈ కేసుకు సంబంధించి 10 మంది నిందితులపై కేసు నమోదు చేశారు. అయితే తాజాగా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న బజారయ్య ద్వారకాతిరుమల పోలీసుల…
పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీకి తిరుగే లేకుండా పోయింది. 2019 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో ఉండి, పాలకొల్లు తప్ప అన్ని స్థానాల్లో వైసీపీ అభ్యర్ధులు విజయం సాధించారు. ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలంలో వైసీపీలో వర్గ పోరు తారస్థాయికి చేరింది. సాక్షాత్తు వైసీపీ ఎంపీటీసీ చంపుతానని అదే పార్టీకి చెందిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెదిరిస్తున్నాడంటూ, ప్రాణ రక్షణ కావాలని నేరుగా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. https://ntvtelugu.com/pinnelli-ramakrishna-reddy-meets-cm-jagan/ ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లికి ఎంపీటీసీ బజారయ్యను శ్రీరామనవమి రోజున…
పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల ఈవోకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. తమకు డబ్బులు ఇవ్వాలని లేదంటే చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని ద్వారకా తిరుమల ఈవో సుబ్బారెడ్డి అన్నారు. అపరిచిత వ్యక్తులు తనను బెదిరిస్తూన్నారంటూ ద్వారకాతిరుమల దేవస్థానం ఈవో సుబ్బారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ”నీకు ఈవో పోస్టింగ్ రావడానికి తామే కారణం …మాకు 10 లక్షలు ఇవ్వాల”ని డిమాండ్ చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. విజయవాడకు చెందిన నలుగురు వ్యక్తులు డబ్బులు ఇవ్వకపోతే చంపుతామంటూ బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు…
పశ్చిమగోదావరి జిల్లాలో వెలసిన చిన్నతిరుపతిలో ఇద్దరు మహిళల నిరసన చర్చనీయాంశం అయింది. ద్వారకాతిరుమల ఈవోని కలవడానికి వచ్చిన ఇద్దరు మహిళలు ఆలయ విఐపి లాంజ్ ముందు నిరసన తెలిపారు. వీఐపీ లాంజ్ తలుపులు వేసుకొని లోపల ఉన్నారు ఆలయ ఈవో సుబ్బారెడ్డి. అయితే, ఈవోని కలిసేవరకు వెళ్ళమని బైఠాయించిన మహిళలు నినాదాలు చేశారు. వీఐపీ లాంజ్ వద్దకు చేరుకున్న పోలీసులు, టెంపుల్ సెక్యూరిటీ సిబ్బంది వారిని వారించే ప్రయత్నం చేశారు.