Today (07-02-23) Business Headlines: హైదరాబాదులో డచ్ ఐటీ సంస్థ విస్తరణ: డచ్ దేశానికి చెందిన గ్జేబియా ఇంజనీరింగ్ సంస్థ తన ఆఫీసును హైదరాబాదులో విస్తరించింది. మూడేళ్లలో 650 మందికి ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ సంస్థ 19 దేశాల్లో ప్రత్యేక సాఫ్ట్’వేర్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ సర్వీసులను అందిస్తోంది. కంపెనీ ఫౌండర్, సీఈఓ కిరణ్ మాట్లాడుతూ తమ సాఫ్ట్’వేర్ ప్రొడక్టుల డివిజన్ కొన్నేళ్లుగా 30 శాతం చొప్పున గ్రోత్ సాధిస్తోందని చెప్పారు.