Off The Record: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాజకీయ నాయకులకు విచిత్రమైన సమస్య వచ్చి పడిందట. పండగ అన్న మాట వినిపిస్తే చాలు… నిద్రలో కూడా ఉలిక్కిపడి లేస్తున్నారట. ఎవరికి వారు పండగల్ని హాయిగా, జాలీగా, కుటుంబ సమేతంగా చేసుకుంటుంటే… వీళ్ళకు మాత్రం అదీఇదీ అని లేదు. ఏదో ఒకటి… పండగ… అన్న మాట వినిపిస్తే చాలు దిగాలుగా ఫేస్‌లు పెట్టేసి జేబులు తడుముకుంటున్నట్టు చెప్పుకుంటున్నారు. మరీ ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో టిక్కెట్లు ఆశిస్తున్న నేతలకే…