దేశరాజధాని ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు పోలీసులు.. దసరా, దీపావళి పండగల సందర్భంగా దేశ రాజధానిలో తీవ్రవాదుల దాడులు జరగవచ్చని ఢిల్లీ పోలీసులకు ఇంటలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి.. దీంతో.. అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు. ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించారు.. ఢిల్లీ పోలీస్ కమీషనర్ రాకేష్ ఆస్తానా నేతృత్వంలో జరిగిన పోలీసు ఉన్నతాధికారుల సమయంలో ఐబీ హెచ్చరికలపై చర్చించారు.. తీవ్రవాదులు దాడులకు స్థానిక క్రిమినల్స్, గ్యాంగ్ స్టర్ల సహకారం తీసుకునే అవకాశం ఉందని పోలీసు ఉన్నతాధికారులకు అప్రమత్తం చేశారు…