Rajnath Singh: దేశ సరిహద్దులో భారత సైన్యం అలర్ట్ గా ఉందని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. అందువల్లే సరిహద్దుల్లో ఎలాంటి ఉద్రిక్తతలు జరగడం లేదన్నారు. కానీ, ఈ విషయంలో అజాగ్రత్త పనికి రాదు.. పొరుగు దేశాల నుంచి కవ్వింపు చర్యలు వచ్చే ప్రమాదముందని హెచ్చరికలు జారీ చేశారు.
Dasara Effect Liquor Sales: తెలంగాణలో దసరా అంటే దాదాపు ప్రతి ఇంట్లో మటన్ ముక్క, మద్యం ఉండాల్సిందే. మందు లేకుండా ముద్ద దిగదు. ఈ నేపథ్యంలో దసరా సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో మద్యం విక్రయాలు విపరీతంగా పెరిగాయి.
Dussehra Wishes 2024: దసరా పండుగ సందర్భంగా తెలంగాణ ప్రజలకు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని దుర్గాదేవిని వేడుకున్నారు.
కర్నూలు జిల్లా దేవరగట్టులో పోలీసులు భారీగా మోహరించారు. మాలమల్లేశ్వర స్వామి కళ్యాణోత్సవం, బన్నీ ఉత్సవానికి 800 మంది పోలీసుల బందోబస్తు కొనసాగుతోంది. హళగొంద మండలం దేవరగట్టు కొండ ప్రాంతంలో స్వయంబుగా వెలిసిన మాళ మల్లేశ్వర స్వామి దేవాలయంలో విజయదశమి రోజు ఆర్ధరాత్రి జరిగే బన్నీ ఉత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు, అప్రమత్తంగా ఉన్నారు.
దసరా పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. విజయదశమి రోజున శ్రీరాముడు లంకాపతి రావణుని సంహరించాడు. ఇది కాకుండా, విజయదశమి పండుగ దుర్గమాతతో కూడా ముడిపడి ఉంటుంది. ఈ రోజున దుర్గామాత మహిషాసురుడిని సంహరించిందని పురాణాలు చెబుతున్నాయి. దసరా పండుగను ప్రతి సంవత్సరం అశ్విన్ మాసం శుక్ల పక్షం పదవ రోజున జరుపుకుంటారు. విజయదశమి రోజున దేశవ్యాప్తంగా రావణ దహనం జరుగుతుంది. అలాగే ఆయుధాలను పూజించే సంప్రదాయం కూడా ఉంది. దసరా రోజున రావణ దహనం,…
Here is Cyberabad Police Warnings to Hyderabad Peoples: ‘దసరా’ పండగను స్వగ్రామాల్లో జరుపుకునేందుకు హైదరాబాద్ నగరవాసులు అందరూ తరలివెళ్తున్నారు. విజయదశమి వరకు నగరం అంతా ఖాళీ కానుంది. ఇదే అదునుగా దొంగలు రెచ్చిపోయే అవకాశముంది. ఖాళీగా ఉన్న ఇంట్లో చొరబడి దొరికినకాడికి దోచుకునే అవకాశం ఉంది. ఈ దొంగతనాల నివారణకు సైబరాబాద్ పోలీసులు కీలక సూచనలు చేశారు. ఇంటికి తాళాలు వేసి ఊరు వెళ్లాల్సి వస్తే.. తగిన ఏర్పాట్లు చేసుకున్న తర్వాతే వెళ్లాలని హెచ్చరించారు.…
2024 Dussehra Scheme in Velmakanne Village: తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పండగ ‘దసరా’. ఈ పండుగకు వస్త్ర, నగల వ్యాపార సంస్థలు భారీగా ఆఫర్లను పెడుతూ కస్టమర్లను ఆకర్షిస్తుంటారు. ప్రతి దసరాకు ఇది సర్వసాధారణమే. అయితే ఓ గ్రామంలోని యువకులు వినూత్నంగా ఆలోచించి ఓ స్కీమ్‌ను పెట్టారు. 2024 దసరాకు బంపర్ ఆఫర్ అంటూ.. ‘రూ.100 కొట్టు మేకను పట్టు’ అనే స్కీమ్ పెట్టారు. స్కీమ్‌లో ఐదు బహుమతులను కూడా అందించనున్నారు. ఆ బహుమతులే ఇక్కడ…