Dasara Effect Liquor Sales: తెగ తాగేశారు.. 8 రోజుల్లో రూ.852.38 కోట్ల విలువైన మద్యం..
- దసరా సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో మద్యం విక్రయాలు విపరీతంగా పెరిగాయి..
- 8 రోజుల్లో రూ.852.38 కోట్ల మద్యం విక్రయాలు..
- అక్టోబర్ 1 నుంచి 10వ తేదీ వరకు రూ.800 కోట్లు..
- గత ఏడాదితో పోలిస్తే పది రోజుల్లోనే 6.55 శాతం మందు తాగేశారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dasara Effect Liquor Sales: తెలంగాణలో దసరా అంటే దాదాపు ప్రతి ఇంట్లో మటన్ ముక్క, మద్యం ఉండాల్సిందే. మందు లేకుండా ముద్ద దిగదు. ఈ నేపథ్యంలో దసరా సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో మద్యం విక్రయాలు విపరీతంగా పెరిగాయి. సాధారణ రోజులతో పోలిస్తే గత ఐదు రోజుల్లో విక్రయాలు 25 శాతం పెరిగాయి. గతేడాది దసరాతో పోలిస్తే ఈ ఐదు రోజుల్లో అమ్మ కాలు 15 శాతం పెరిగి సగటున రాష్ట్రంలో రోజుకు రూ.124 కోట్ల మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. ఈ నెల 10న రికార్డు స్థాయిలో రూ.139 కోట్ల విలువైన మద్యాన్ని డిపోల నుంచి వైన్‌షాలకు తరలించారు. ఒకే రోజు ఏకంగా 2.35 లక్షల బీర్లు వైన్ షాప్ లకు చేరడం గమనార్హం.
Read also: Ponnam Prabhakar : స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి పొన్నం క్లారిటీ
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
- Ponguleti Srinivas :22-ఎ భూములపై ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నెల రోజుల్లోనే పరిష్కారం
ఏడాది కాలంలోనే ఈ స్థాయిలో బీర్ల అమ్మకాలు జరగడం రికార్డు అని ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నా వాస్తవంలో సగటున రోజుకు రూ.100 కోట్ల మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. లక్ష కేసుల వరకు మద్యం విక్రయిస్తున్నారు. కానీ, దసరా సందర్భంగా ఈ అమ్మకాల జోరు పెరిగింది. ఐదు రోజుల సగటును పరిశీలిస్తే రోజుకు 1.20 లక్షల కేసుల మద్యం, 2 లక్షల కేసుల బీరు విక్రయాలు జరిగాయి. ఇక.. ఈనెల 1వ తేదీ నుంచి గణాంకాలను పరిశీలిస్తే.. 8 రోజుల్లో రూ.852.38 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. ఇందులో 8.37 లక్షల మద్యం కేసులు, 14:53 లక్షల కేసుల బీరు ఉన్నాయి. గతేడాది అక్టోబర్ 1 నుంచి 10వ తేదీ వరకు రూ.800 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. గత ఏడాదితో పోలిస్తే పది రోజుల్లోనే 6.55 శాతం మంది మందుబాబులు ఫుల్ గా లాగించేశారని ఈ గణాంకాలు చెబుతున్నాయి.
తాజావార్తలు
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
PM Modi Navratri Wishes 2026: దేశ ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ.. మాత శైలపుత్రిపై ఏమన్నారంటే?
-
Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
ట్రెండింగ్
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..