Dussehra Wishes 2024: దసరా పండుగ సందర్భంగా తెలంగాణ ప్రజలకు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని దుర్గాదేవిని వేడుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్ ముఖ్య కార్యదర్శి బి.వెంకటేశం అధికారులు, సిబ్బందితో కలిసి రాజ్‌భవన్‌లో ఆయుధ, వాహన పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలని దుర్గామాతను కోరుకున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ: దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. దుర్గామాత, ప్రభు శ్రీరాముల ఆశీస్సులతో జీవితంలోని ప్రతి రంగంలో విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
देशवासियों को विजयादशमी की असीम शुभकामनाएं। मां दुर्गा और प्रभु श्रीराम के आशीर्वाद से आप सभी को जीवन के हर क्षेत्र में विजय हासिल हो, यही कामना है।
— Narendra Modi (@narendramodi) October 12, 2024
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు: విజయదశమి సందర్భంగా దేశ, విదేశాల్లోని తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు. ప్రజలంతా సుఖ శాంతులతో వర్థిల్లేలా చూడాలని ఆ కనకదుర్గమ్మ తల్లిని వేడుకుంటున్నాను. చెడు పై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిర్వహించుకునే దసరా పండుగ మన జీవితాల్లో కొత్త వెలుగు నింపాలని ఆకాంక్షిస్తున్నాను. దుష్ట సంహారం తర్వాత శాంతి, సౌభ్రాతృత్వంతో అందరూ కలిసిమెలిసి జీవించాలన్నదే దసరా పండుగ సందేశం. ఇదే స్ఫూర్తితో శాంతియుత, అభివృద్ధికారక సమాజం కోసం కృషి చేద్దాం. శక్తి ఆరాధనకు ప్రాధాన్యతనిచ్చే ఈ పండుగ దినాల్లో అమ్మవారి దివ్యమంగళ రూపాన్ని తొమ్మిది అవతారాల్లో దర్శించుకున్నాం. మరో వైపు ఆ దేవదేవుడైన తిరుమల శ్రీ వేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుపుకున్నాం. ఇదే ఒరవడితో సర్వజన సంక్షేమాన్ని కొనసాగిద్దాం. మరొక్క మారు అందరికి మనస్ఫూర్తిగా దసరా శుభాకాంక్షలు తెలుపుతున్నాను.
విజయదశమి సందర్భంగా దేశ, విదేశాల్లోని తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు. ప్రజలంతా సుఖ శాంతులతో వర్థిల్లేలా చూడాలని ఆ కనకదుర్గమ్మ తల్లిని వేడుకుంటున్నాను. చెడు పై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిర్వహించుకునే దసరా పండుగ మన జీవితాల్లో కొత్త వెలుగు నింపాలని ఆకాంక్షిస్తున్నాను. దుష్ట…
— N Chandrababu Naidu (@ncbn) October 11, 2024
సీఎం రేవంత్ రెడ్డి: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి దసరా పండుగా శుభాకాంక్షలు తెలిపారు. సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగ ఉండాలని తెలిపారు. జన సంక్షేమానికి.. ప్రజా ప్రభుత్వ సంకల్పం విజయపథాన సాగాలన్నారు. విశ్వ వేదిక పై… తెలంగాణ సగర్వంగా నిలవాలని తెలిపారు. తెలంగాణ ప్రజలందరికి దసరా శుభాకాంక్షలు తెలిపారు.
సుఖశాంతుల తెలంగాణ
సుభిక్షంగ ఉండాలి…జన సంక్షేమానికి …
ప్రజా ప్రభుత్వ సంకల్పం
విజయపథాన సాగాలి.విశ్వ వేదిక పై…
తెలంగాణ సగర్వంగా నిలవాలి.ప్రజలందరికి దసరా శుభాకాంక్షలు. #Dussehra2024 #Dussehra pic.twitter.com/WxlgheY9lo
— Revanth Reddy (@revanth_anumula) October 12, 2024
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క: తెలంగాణ ప్రజలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే దసరా పండుగను చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ప్రజలందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆకాంక్షించారు
చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతం.. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతిరూపంగా నిలిచే దసరా పండుగను ప్రజలంతా ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరుకుంటూ…
రాష్ట్ర ప్రజలందరికీ దసరా పండగ శుభాకాంక్షలు#Dussehra2024 pic.twitter.com/wCMsGsO6CE— Bhatti Vikramarka Mallu (@Bhatti_Mallu) October 12, 2024
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ : ప్రజలందరికీ విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు. విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ విజయదశమి ప్రజలందరికీ విజయం చేకూర్చాలని, తెలుగు రాష్ట్రాలపై శక్తి స్వరూపిణి దీవెనలు ఉండాలని ప్రార్థిస్తున్నాను –
ప్రజలందరికీ విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు. విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ విజయదశమి ప్రజలందరికీ విజయం చేకూర్చాలని, తెలుగు రాష్ట్రాలపై శక్తి స్వరూపిణి దీవెనలు ఉండాలని ప్రార్థిస్తున్నాను – @PawanKalyan#HappyDussehra pic.twitter.com/7HgepAcqq2
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) October 11, 2024
ఏపీ మంత్రి నారా లోకేష్: తెలుగు ప్రజలందరికీ దసరా, విజయదశమి శుభాకాంక్షలు. రాష్ట్రాన్ని ధ్వంసం చేసి, ప్రజల్ని హింసించిన జగనాసురుడి దుష్టపాలనను జనమే అంతమొందించారు. వైసీపీ చెడుపై కూటమి మంచి విజయం సాధించింది. వరద రూపంలో వచ్చిన విపత్తుపై విజయం సాధించాం. వేలాది ఉద్యోగాలు ఇచ్చే లులూ, ఫాక్స్ కాన్, హెచ్సీఎల్ విస్తరణ, టీసీఎస్ తెచ్చుకున్నాం. పోలవరం సాకారం కానుంది. రైల్వేజోన్ శంకుస్థాపన జరగనుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కేంద్రం చేయూతనందిస్తోంది. ఇన్ని మంచి విజయాలు అందించిన ఈ విజయదశమిని సంతోషంగా జరుపుకుందాం. ప్రజా సంక్షేమం- రాష్ట్రప్రగతే ధ్యేయంగా శ్రమిస్తున్న మంచి ప్రభుత్వానికి ప్రజల మద్దతు, దుర్గమ్మ ఆశీస్సులు లభించాలని కోరుకుంటున్నాను.
తెలుగు ప్రజలందరికీ దసరా, విజయదశమి శుభాకాంక్షలు. రాష్ట్రాన్ని ధ్వంసం చేసి, ప్రజల్ని హింసించిన జగనాసురుడి దుష్టపాలనను జనమే అంతమొందించారు. వైసీపీ చెడుపై కూటమి మంచి విజయం సాధించింది. వరద రూపంలో వచ్చిన విపత్తుపై విజయం సాధించాం. వేలాది ఉద్యోగాలు ఇచ్చే లులూ,…
— Lokesh Nara (@naralokesh) October 12, 2024
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్: దసరా సందర్భంగా మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. విజయదశమి ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని దుర్గామాతను ప్రార్థించానని పేర్కొన్నారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి : అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఒక్కరికీ విజయాలు సిద్ధించాలని కోరుకుంటూ తెలుగువారందరికీ విజయ దశమి శుభాకాంక్షలు తెలపారు.
అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఒక్కరికీ విజయాలు సిద్ధించాలని కోరుకుంటూ తెలుగువారందరికీ విజయ దశమి శుభాకాంక్షలు.
— YS Jagan Mohan Reddy (@ysjagan) October 12, 2024
కేటీఆర్: బీఆర్‌ఎస్ అగ్రనేత, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. శమీ శమయతే పాపం..శమీ శత్రు వినాశనీ ! అర్జునస్య ధనుర్ధారీ… రామస్య ప్రియ దర్శినీ! జమ్మి పూజతో నిత్య జయాలు కలగాలన్నారు. పాలపిట్ట దర్శనంతో సకల శుభాలు జరగాలని కోరారు. అలయ్ బలయ్ ఆత్మీయ ఆలింగనాలు.. సరదాలు సంతోషాలతో దసరా పండుగను జరుపుకోవాలని కోరుకుంటూ…
అందరికీ విజయదశమి శుభాకాంక్షలు ! తెలిపారు
శమీ శమయతే పాపం..శమీ శత్రు వినాశనీ !
అర్జునస్య ధనుర్ధారీ… రామస్య ప్రియ దర్శినీ!జమ్మి పూజతో నిత్య జయాలు కలగాలి !
పాలపిట్ట దర్శనంతో సకల శుభాలు జరగాలి!అలయ్ బలయ్ ఆత్మీయ ఆలింగనాలు.. సరదాలు సంతోషాలతో దసరా పండుగను జరుపుకోవాలని కోరుకుంటూ…
అందరికీ విజయదశమి శుభాకాంక్షలు !
Happy…
— KTR (@KTRBRS) October 12, 2024
హరీష్ రావు: దసరా పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిరూపమని బీఆర్‌ఎస్ కీలక నేత, రాష్ట్ర మాజీ మంత్రి హరీష్ రావు ఆకాంక్షించారు. ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు హరీష్ రావు అధికారిక ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. “శమీ శమయతే పాపం, శమీశతృ వినాశనీ | అర్జునస్య ధనుర్ధారీ, రామస్య ప్రియదర్శినీ || అనే దసరా ప్రత్యేక శ్లోకాన్ని కూడా ప్రస్తావించారు.
“శమీ శమయతే పాపం, శమీశతృ వినాశనీ |
అర్జునస్య ధనుర్ధారీ, రామస్య ప్రియదర్శినీ ||తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతిరూపంగా నిలిచే దసరా పండుగను దుర్గామాత ఆశీస్సులతో ప్రజలంతా ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరుకుంటూ ప్రజలందరికీ విజయ దశమి శుభాకాంక్షలు.#HappyDusshera pic.twitter.com/vc29ZUlBOI
— Harish Rao Thanneeru (@BRSHarish) October 12, 2024
వై ఎస్ షర్మిళ: చెడుపై మంచి సాధించిన విజయమే విజయదశమి.. రాష్ట్ర ప్రజలందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు.
చెడుపై మంచి సాధించిన విజయమే విజయదశమి..
రాష్ట్ర ప్రజలందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. #Dussehra pic.twitter.com/MAI0uREZ1K— YS Sharmila (@realyssharmila) October 12, 2024
Telangana Auto Drivers: కొత్త ఆటోల కొనుగోలుకు ‘నో ఫర్మిట్’.. జీరో పొల్యూషన్‌పై రవాణా శాఖ దృష్టి..