Navaratri Special: సాధారణంగా ఏదైనా ఆలయానికి వెళ్తే భక్తులు ఆలయం బయటే చెప్పులు విడిచి లోపలకు వెళ్తారు. ఇది సంప్రదాయం కూడా. అలాంటిది దేవుడికి చెప్పులు సమర్పించడం ఎక్కడైనా చూస్తామా.. కానీ మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో మాత్రం ఈ సన్నివేశం కనిపిస్తుంది. భోపాల్‌లోని కోలా ప్రాంతంలో జిజిబాయ్ ఆలయం, పహడావాలీ మాతా ఆలయానికి వెళ్లే భక్తులు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి చెప్పులు, షూలు సమర్పించి తమ కష్టాలు చెప్పుకుంటారు. దీనికి ఓ కారణముందని అక్కడి స్థానికులు వివరిస్తున్నారు.…