ఇండిగో సంక్షోభంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక స్టేట్‌మెంట్ జారీ చేసింది. దేశ వ్యాప్తంగా నెలకొన్న ఇండిగో సంక్షోభంపై అత్యవసర విచారణ చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. సోమవారం పిటిషన్ విచారణకు రాగా... సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
భారతదేశంలో ఇండిగో ఎయిర్‌లైన్స్ సృష్టించిన సంక్షోభం అంతా ఇంతా కాదు. మా దగ్గర ఆటలు చెల్లవన్నట్టుగా అటు విమానయాన శాఖకు.. ఇటు ప్రయాణికులకు ఇండిగో ఎయిర్‌లైన్స్ సంస్థ ఓ పాఠం నేర్పించింది. గత వారం రోజులుగా ప్రయాణికులు విమానాశ్రయాల్లో నరక యాతన పడుతున్నారు.