Prabhas:పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. షూటింగ్స్, ఇల్లు తప్ప డార్లింగ్ బయట చాలా తక్కువ కనిపిస్తాడు. ఇక ఎప్పుడో ఒక్కసారి మాత్రమే వేరే హీరోల ఫంక్షన్స్ కు గెస్ట్ గా వెళ్తూ ఉంటాడు. అలా వెళ్లినా కూడా స్పీచ్ ను రెండు ముక్కలో తేల్చేస్తాడు. ఇక స్పీచ్ పక్కన పెడితే స్టేజిపై డార్లింగ్ ని చూడొచ్చు అని అభిమానులు ఆశపడుతూ ఉంటారు. ఇక ఇటీవలే ప్రభాస్, సీతారామం ప్రీ రిలీజ్…
‘మహానటి’తో టాలీవుడ్ అరంగేట్రం చేసిన దుల్కార్ సల్మాన్.. హను రాఘవపూడి దర్శకత్వంలో రెండో తెలుగు సినిమా చేస్తున్నాడు. సీతారామం అనే టైటిల్ ఖరారు చేసిన ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తోంది. టైటిల్ అనౌన్స్ మెంట్ దగ్గర నుంచి పాజిటివ్ వైబ్స్ మూటగట్టుకున్న ఈ సినిమా నుంచి తాజాగా ఓ టీజర్ వచ్చింది. ఎవరూ లేని రామ్ అనే ఓ ఒంటరి సైనికుడు, అతని ప్రేమలో పడే సీత అనే అమ్మాయి చుట్టూ.. ఓ అందమైన…
దుల్కర్ సల్మాన్ హీరోగా, హను రాఘవపూడి దర్శకత్వంలో అశ్వినీదత్, ప్రియాంక దత్ నిర్మిస్తున్న చిత్రం ‘సీతారామం’. ‘యుద్ధంతో రాసిన ప్రేమకథ’ అనేది ఈ మూవీ ఉపశీర్షిక. మృణాళిని ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో రష్మిక మందన్న ఓ కీలకపాత్రలో కనిపించబోతోంది. ఇందులో దుల్కర్ సల్మాన్ లెఫ్టినెంట్ రామ్ గా నటిస్తుండగా, ఆఫ్రీన్ అనే ముస్లిం మహిళ పాత్రను రష్మిక పోషిస్తోంది. వెటరన్ సినిమాటోగ్రాఫర్ పీఎస్ వినోద్ ఛాయాగ్రహణం అందిస్తున్న ‘సీతారామం’కు విశాల్ చంద్రశేఖర్ సంగీతం…
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా రష్మిక ప్రధాన పాత్రలో హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెల్సిందే. వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్విని దత్, ప్రియాంక్ దత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. యుద్ధంతో రాసిన ప్రేమకథ అనే ట్యాగ్ లైన్ తో ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా నేడు శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమా…
మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, కాజల్ అగర్వాల్, అదితి రావ్ హైదరి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం హే సినామిక. ఈ సినిమాతో కొరియోగ్రాఫర్ బృంద డైరెక్టర్ గా మారబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. ” ఆర్జే గా పనిచేసే ఆర్యన్ కి మౌన(అదితి) పరిచయమవుతుంది. ఆ పరిచయం…
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా సినీ నటి అదితి రావు హైదరి విసిరిన చాలెంజ్ స్వీకరించి ప్రముఖ సినీ నటుడు దుల్కర్ సల్మాన్ కేబీఆర్ పార్క్ లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు.ప్రతి ఒక్కరు ఈ చాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని నాటిన మొక్కలను సంరక్షించుకోవాలని…
టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్ క్రీడల్లో భారత తరఫున పాల్గొని తొలి స్వర్ణాన్ని గెలుచుకున్నాడు నీరజ్ చోప్రా. జావెలిన్ త్రోలో భారత్ కు దక్కిన తొలి స్వర్ణమిది. అంతేకాదు అధ్లెట్స్ విభాగంలోనూ భారత్ ఒలింపిక్స్ లో అందుకున్న మొట్టమొదటి బంగారు పతకం ఇది. ఈ సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ మొదలుకొని పలువురు సినీ రాజకీయ ప్రముఖులు నీరజ్ చోప్రాపై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. దక్షిణాదిలో చిరంజీవి, మోహన్ బాబు, మహేశ్ బాబు, మోహన్ లాల్, ఎస్.…
హృతిక్ రోషన్, ఆపైన కియారా అద్వాణీ, అటు పైన విజయ్ దేవరకొండ, ఆ మీద సమంత రూత్ ప్రభు, అటు మీద దుల్కర్ సల్మాన్… ఏంటి ఈ లిస్టు అనుకుంటున్నారా? ఇదో ‘మింత్రా మల్టీ స్టారర్’! ప్రస్తుతం ఆన్ లైన్ యుగం నడుస్తోంది. కరోనా లాక్ డౌన్స్ పుణ్యం కొద్దీ రోడ్డు మీదకు వెళ్లే అవకాశాలు మరింత తగ్గిపోయాయి. షాపింగ్ ప్రియులు ఏం చేస్తారు మరి? అంతా అన్ లైన్ లోనే కానిచ్చేస్తున్నారు. అందుకే, ఈ కామర్స్…