హృతిక్ రోషన్, ఆపైన కియారా అద్వాణీ, అటు పైన విజయ్ దేవరకొండ, ఆ మీద సమంత రూత్ ప్రభు, అటు మీద దుల్కర్ సల్మాన్… ఏంటి ఈ లిస్టు అనుకుంటున్నారా? ఇదో ‘మింత్రా మల్టీ స్టారర్’!
ప్రస్తుతం ఆన్ లైన్ యుగం నడుస్తోంది. కరోనా లాక్ డౌన్స్ పుణ్యం కొద్దీ రోడ్డు మీదకు వెళ్లే అవకాశాలు మరింత తగ్గిపోయాయి. షాపింగ్ ప్రియులు ఏం చేస్తారు మరి? అంతా అన్ లైన్ లోనే కానిచ్చేస్తున్నారు. అందుకే, ఈ కామర్స్ సైట్లు ఉత్సాహంతో ఉరకలేస్తున్నాయి. పనిలో పనిగా స్టార్ హీరోలు, హీరోయిన్స్ తో ప్రచారం చేయిస్తూ యంగ్ జెనరేషన్ ను అట్రాక్ట్ చేస్తున్నాయి. మింత్రా కూడా ఇప్పుడు అదే మంత్రం జపిస్తోంది!
Read Also : స్టాండప్ రాహుల్ : “అలా ఇలా…” లిరికల్ వీడియో సాంగ్
ఆన్ లైన్ ఫ్యాషన్ ఈ కామర్స్ దిగ్గజం మింత్రా ఒకేసారి హృతిక్, కియారా, విజయ్ దేవరకొండ, సమంత, దుల్కర్ సల్మాన్ ను బరిలోకి దింపింది. తమ బ్రాండ్ ను ప్రచారం చేసేందుకు అయిదుగురు హార్ట్ త్రోబ్స్ ను ఎంచుకుంది. అంతే కాదు, వివిధ సినిమా రంగాల్లో బోలెడు ఫాలోయింగ్ ఉన్న వీరంతా వినూత్నంగా మింత్రా పబ్లిసిటీ మొదలు పెట్టారు.
మొదట హృతిక్ తన ఫోటో షేర్ చేస్తూ కియారాని ”ఇది సరిపోతుందా” అని అడిగాడు. దానికి ఆమె స్పందిస్తూ ”సరిపోదు, ఇది బెటర్ అనుకుంటా… ” అంటూ హృతిక్ తో తాను కూడా ఉన్న ఫోటోను షేర్ చేసింది! అంతే కాదు, విజయ్ దేవరకొండని ట్యాగ్ చేసింది! అక్కడ్నుంచీ అందుకున్న మన వీడి తనని యాడ్ చేసుకున్నాడు మింత్రా ఫ్యాషన్ ఫ్యామిలీలో! హృతిక్, కియారా, దేవరకొండ కనిపిస్తోన్న ఫోటోకి తనని తాను యాడ్ చేసుకుంది సమంత. ఆ తరువాత దుల్కర్ చేరాడు మింత్రా గ్యాంగ్ లో! చివరగా మింత్రా కంపెనీ తమ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో అయిదురు బ్రాండ్ అంబాసిడర్స్ ఉన్న క్రేజీ ఫోటోను షేర్ చేసింది! ఇప్పుడు ఈ మల్టీ స్టారర్ ఫ్యాషన్ పిక్ నెట్ లో వైరల్ అవుతోంది…