యూత్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ నటించిన తాజా యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘డ్యూడ్’ బాక్సాఫీస్ వద్ద డామినేషన్ కొనసాగిస్తోంది. ప్రతిష్టాత్మక పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం, కీర్తిస్వరన్ దర్శకత్వంలో రూపొందింది. ఓపెనింగ్ డేలో 22 కోట్లు వసూలు చేసిన ఈ మూవీ, రెండో రోజు కూడా అదే ఊపు కొనసాగించింది. రెండో రోజు 23 కోట్లు+ గ్రాస్ వసూలు చేసిన ‘డ్యూడ్’, రెండు రోజుల్లో మొత్తం 45 కోట్లు+ సాధించింది.…