హైదరాబాద్ లో డ్రగ్స్ నిర్మూలనపై స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుంది. ఇప్పటికే వరుస దాడులు కొనసాగుతుండటంతో పలువురుని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక, టీఎస్ఎన్ఏబీ, ఎస్ఓటీ, టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. 24 గంటల్లో నాలుగు డ్రగ్స్ గ్యాంగ్స్ ను అరెస్ట్ చేశారు.
హైదరాబాద్లో నార్కోటిక్ బ్యూరో అధికారులు భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. ఎస్సార్ నగర్ లోని సర్వీస్ అపార్ట్మెంట్లో డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారు. బర్త్ డే పార్టీ కోసం గోవా నుంచి ఎక్స్టెన్సీ పిల్స్ తీసుకొచ్చారు యువకులు. డ్రగ్స్ తో పట్టుబడిన వారంతా నెల్లూరు జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు అధికారులు. 12 మంది ఇంజనీరింగ్ విద్యార్థులతో పాటు సాఫ్ట్ వేర్ ఉద్యోగులను అరెస్ట్ చేసినట్లు నార్కోటిక్ బ్యూరో అధికారులు తెలిపారు. ప్రేమ్ చంద్ అనే వ్యక్తి బర్త్…
తెలంగాణలో డ్రగ్స్ మాట వినపడొద్దు అని తెలిపారు. డ్రగ్స్ నిర్మూలనకు ఏది కావాలంటే అది చేస్తాం.. నార్కోటిక్ బ్యూరోపై పోలీసు అధికారులతో సమీక్షలో కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆక్టోపస్ గ్రేహౌండ్స్ లాగా నార్కోటిక్ టీమ్ ని బలోపేతం చేస్తాం.. డ్రగ్స్ నిర్మూలించి దేశానికి తెలంగాణ పోలీస్ రోల్ మోడల్ గా నిలవాలి అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లోని సున్నితమైన పాయింట్లను మ్యాపింగ్ చేయడంతో పాటు.. డ్రోన్‌ల కదలికలు, డ్రగ్స్, ఆయుధాల అక్రమ రవాణాను తనిఖీ చేయడానికి ఏజెన్సీ ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని (SOP) సిద్ధం చేసినట్లు సరిహద్దు భద్రతా దళం (BSF) అధికారులు తెలిపారు. చండీగఢ్‌లో బీఎస్‌ఎఫ్ వెస్ట్రన్ కమాండ్ స్పెషల్ డైరెక్టర్ జనరల్ యోగేష్ బహదూర్ ఖురానియా మాట్లాడుతూ.. భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో డ్రోన్‌ల కదలికలను బీఎస్‌ఎఫ్ పర్యవేక్షిస్తోందని, గత ఏడాది కాలంలో 95 డ్రోన్‌లను కూల్చివేసినట్లు తెలిపారు.
ఐదు ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఉద్దేశించిన రూ.1,760 కోట్ల విలువైన ఉచితాలు, డ్రగ్స్, నగదు, మద్యం, విలువైన లోహాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల సంఘం సోమవారం వెల్లడించింది.
ఇండియా కూటమికి మద్దతు ఇవ్వడానికి తమ పార్టీ కట్టుబడి ఉందని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం చెప్పారు. భారత కూటమితో తమ పార్టీ విడిపోదని స్పష్టం చేశారు.
Rave Party: టాలీవుడ్లో డ్రగ్స్ గుట్టు మరోమారు బట్టబయలైంది. హైదరాబాద్ మాదాపూర్లో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. విఠల్ రావు నగర్ వైష్ణవి అపార్ట్ మెంట్లో యాంటీ నార్కొటిక్ బ్యూరో అధికారులు దాడులు నిర్వహించారు.
కేరళలోని కరిపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో డీఆర్ఐ అధికారులు భారీగా మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఓ ప్రయాణికుడు అక్రమంగా తరలిస్తుండగా.. అతని నుండి కొకైన్, హెరాయిన్ ను పట్టుకున్నారు. ఆ డ్రగ్స్ విలువ రూ. 44 కోట్ల విలువ ఉంటుందని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపారు.
నాగ్‌పూర్ విమానాశ్రయం నుంచి రూ. 24 కోట్ల విలువైన 3.07 కిలోల యాంఫెటమైన్-రకం మత్తు పదార్థాన్ని అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించినందుకు ఢిల్లీకి చెందిన నైజీరియన్ జాతీయుడితో సహా ఇద్దరు వ్యక్తులను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అరెస్టు చేసింది.DRI అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, అధికారుల బృందం నిర్దిష్ట నిఘా ఆధారంగా ఉచ్చు వేసి, ఆగస్టు 20న నాగ్‌పూర్‌లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 43 ఏళ్ల భారతీయుడిని అడ్డగించింది. అతను కెన్యాలోని నైరోబీ…