త్రిపురలో 47 మంది విద్యార్థులు హెచ్‌ఐవీతో మృతి చెందారు. ఇప్పటివరకు 828 మంది విద్యార్థులను హెచ్‌ఐవీ పాజిటివ్‌గా గుర్తించామని త్రిపుర స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (TSACS) సీనియర్ అధికారి తెలిపారు. 828 మంది హెచ్‌ఐవీ పాజిటివ్ విద్యార్థుల్లో 572 మంది బతికే ఉన్నారని తెలిపారు.
మత్తు పదార్థాలు జీవితాలను నాశనం చేస్తాయి అని తెలిసి కూడా యువత మత్తుకు బానిసలుగా మారుతున్నారు. పోలీసులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ భారీ మత్తు పదార్థాలను పట్టుకుంటున్న జనాల్లో మార్పు రావడం లేదు.
Nigerian Drug Peddler Arrested: హైదరాబాద్‌కు మాదకద్రవ్యాల సరఫరా చేస్తున్న ప్రముఖ సూత్రధారి అయిన ఒకరో కాస్మోస్ రాంసి పోలీసులకు చిక్కాడు. అతడు చాలా కాలం నుంచి నగరంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు దేశవ్యాప్తంగా జైళ్లలో ఉన్న నైజీరియన్ల సమాచారాన్ని సేకరించి వారికోసం సహాయనిధి ఏర్పాటు చేశాడని. ఆ తరువాత వారినే జాతీయస్థాయిలో డ్రగ్ స్మగ్లింగ్‌కు వాడుకునేవాడని తెలంగాణ స్టేట్ యాంటీ-నార్కోటిక్స్ బ్యూరో, హైదరాబాద్ నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ పోలీసులు గుట్టురట్టు చేశారు. అతడు చాలా కాలం…
డ్రగ్స్ను సరఫరా చేసేందుకు స్మగ్లర్లు వినూత్న రీతిలో ఆలోచిస్తున్నారు. డబ్బుల కోసం ఎంతటి సాహాసానికైనా వెనుకాడటం లేదు. అయితే.. ఈసారి స్మగర్లు చిన్న పిల్లల లంచ్ బాక్స్ లో డ్రగ్స్ ను సరఫరా చేసేందుకు సిద్ధమయ్యారు. కానీ.. ఆ బాక్స్ కస్టమ్ అధికారుల కంటపడింది. అందులో ఏముందోనని తెరిచి చూడగా.. రూ. కోటి కంటే ఎక్కువ విలువ చేసే డ్రగ్స్ లభ్యమైంది.
రాజేంద్రనగర్ లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు ఎక్సైజ్ అధికారులు. సన్ సిటీ వద్ద 270 గ్రాముల (MDMA) డ్రగ్స్ పట్టుకుని సీజ్ చేశారు. ఓ యువకుడి తో పాటు మహిళను అరెస్ట్ చేశారు. సన్ సిటీ వద్ద డ్రగ్స్ విక్రయిస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
ఎన్నికల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పట్టుబడ్డ సొమ్ము, మద్యం, మత్తు పదార్థాల వివరాలను ఏపీ పోలీసు శాఖ వెల్లడించింది. 2019 ఎన్నికలతో పోల్చితే 2024లో ఏపీలో భారీగా మద్యం, డ్రగ్స్ భారీగా పట్టుబడ్డట్లు తెలిపింది. ఈ మేరకు బుధవారం ప్రెస్ నోట్ విడుదల చేసింది.
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మురం చేశారు. డ్రగ్స్ టెస్టులో పాజిటివ్ వచ్చిన వారికి బెంగళూరు పోలీసులు నోటీసులు పంపారు. ఈ కేసులో నటి హేమతో పాటు 86 మందికి నోటీసులు జారీ చేశారు.
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ‘రేవ్ పార్టీ’ అనే విషయం తెగ మారుమోగుతోంది. అయితే అసలు ఈ ‘రేవ్ పార్టీ’ అంటే ఏమిటి..? అక్కడికి వెళ్లిన వారు ఏం చేస్తారన్న విషయాలు చూస్తే.. ప్రస్తుతం నగరాల్లో పార్టీ కల్చర్ చెప్పలేనంత పెరిగిపోతుంది. ఏదైనా సందర్భం కానీ.. ఫుల్ గా ఎంజాయ్ చేసేందుకు యువతతో పాటు పెద్దలు కూడా ఆసక్తి చూపుతున్నారు. ఇక ఈ విషయంలో.. కాస్త డబ్బున్న వాళ్లు అయితే.. ఇలాంటి పార్టీలకు బానిసలుగా మారిపోతున్నారు. అసలు…
Bengaluru : బెంగళూరులో ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని ఫామ్‌హౌస్లో జరిగింది. జీఆర్ ఫామ్‌హౌస్‌లో బర్త్ డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవ్ పార్టీని నిర్వహించారు. ఈ రేవ్ పార్టీలో మందుతో పాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ వాడినట్లు తెలుస్తోంది.
రైలు ప్రయాణం చేసేటప్పుడు తమతో పాటు తమ లగేజీలను బ్యాగ్ లలో తీసుకువెళతారు. అయితే.. అందులో ఏముంటుందన్న విషయం పక్కన కూర్చే వారికి తెలియదు. కానీ.. స్మగ్లర్లు రైలు ప్రయాణం ద్వారానే.. కోట్లాది విలువ చేసే డ్రగ్స్ ను రాష్ట్రాలు దాటిస్తున్నారు. సమాచారం అందితే దొరికేవి కొన్నైతే.. దొరకనివి చాలా ఉన్నాయి. తరుచూ మనం చూస్తూనే ఉంటాం.. రైళ్లలో డ్రగ్స్ తరలిస్తున్నారని.. పట్టుబడ్డారన్న వార్తలు వినిపిస్తూనే ఉంటాయి.