ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ‘రేవ్ పార్టీ’ అనే విషయం తెగ మారుమోగుతోంది. అయితే అసలు ఈ ‘రేవ్ పార్టీ’ అంటే ఏమిటి..? అక్కడికి వెళ్లిన వారు ఏం చేస్తారన్న విషయాలు చూస్తే.. ప్రస్తుతం నగరాల్లో పార్టీ కల్చర్ చెప్పలేనంత పెరిగిపోతుంది. ఏదైనా సందర్భం కానీ.. ఫుల్ గా ఎంజాయ్ చేసేందుకు యువతతో పాటు పెద్దలు కూడా ఆసక్తి చూపుతున్నారు. ఇక ఈ విషయంలో.. కాస్త డబ్బున్న వాళ్లు అయితే.. ఇలాంటి పార్టీలకు బానిసలుగా మారిపోతున్నారు. అసలు ఈ మ్యాటర్ అంతా ఎందుకంటే.. తాజాగా ‘రేవ్ పార్టీ’ అనే మాట మారుమోగిపోతోంది. దీనికి కారణం.. బెంగళూరు నగరంలో నిర్వహించిన ఓ రేవ్ పార్టీ. అందులో తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీలు, ఇంకా అనేక బడా వ్యక్తులు పాల్గొని పోలీసులకు పట్టుబడటమే.
Indian 2 : ‘ఇండియన్ 2’ సాంగ్ ప్రోమో వచ్చేసింది..రికార్డులు బద్దలవ్వడం ఖాయం..
గతంలో కూడా చాలా మంది రేవ్ పార్టీలు నిర్వహించి పట్టుబడినా.. నెటిజన్లు అనేకమంది.. అసలు సెలబ్రేటీలు ఎందుకు ఈ పార్టీల్లో పాల్గొంటారు..? ఈ రేవ్ పార్టీ అంటే ఏంటి..? అసలు అక్కడ ఏం చేస్తారు..? ఆ సమయంలో పోలీసులు పబ్ లపై రైడ్ చేయకుండా రేవ్ పార్టీలపై రైడ్ ఎందుకు చేస్తారు..? వంటి అనేక విషయాలపై తెగ సెర్చ్ చేస్తున్నారు. ఇకపోతే ఈ పార్టీ కల్చర్ అనేది 1950 లలో ఇంగ్లండ్ దేశంలో మొదలైంది.
Botsa Satyanarayana: ప్రశాంత్ కిషోర్ ఏమైనా బ్రహ్మా?.. మంత్రి బొత్స ఆసక్తికర వ్యాఖ్యలు.
ఆపై.. ప్రపంచవ్యాప్తంగా ఈ కల్చర్ వ్యాపించింది. ఈ పార్టీలలో మొదట్లో మ్యూజిక్, డ్యాన్స్ అంటూ మామూలుగానే ఎంజాయ్ చేసేవారు. ఆ తర్వాత ఈ పార్టీ కల్చర్ కాస్త కొత్త పుంతలు సంతరించుకుని.. ఓ క్లోజ్డ్ ప్రదేశంలో చెవులు దద్దరిల్లిపోయే మ్యూజిక్ పెట్టుకొని., మద్యం సేవిస్తూ.. పార్టీలు చేసుకునే వారు. ఇలా కాస్త వైల్డ్ బిహేవియర్ తో చేసుకునే పార్టీ లను రానురాను ‘రేవ్’ అని పిలవడం మొదలుపెట్టారు. ఇక ‘రేవ్’ అనే పదం జమైకా బాష నుంచి వచ్చింది. ఇకపోతే సాధారంగా మద్యం సేవిస్తూ, డ్యాన్స్ చేస్తూ పార్టీలు చేసుకోవడం వేరు. ఇలాంటి ఈ రేవ్ పార్టీలు వేరు. ఈ పార్టీలలో పాల్గొనే వారిని ‘రేవర్స్’ అని పిలుస్తారు. కాలక్రమేనా ఈ పార్టీ కల్చర్ లో చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు అడ్డా అయ్యింది. మద్యం మాత్రమే కాకుండా.. మాదక ద్రవ్యాలు కూడా రహస్యంగా వాడడం మొదలయింది.
రేవ్ పార్టీలను 24 గంటల నుంచి మొదలు మూడు రోజుల పాటుగా నిర్వహిస్తారు. ఇందులో కేవలం పరిచయస్తులనే ఆహ్వానిస్తారు. ఎలాంటి కొత్తవారిని రేవ్ పార్టీలకు అనుమతించరు. దానికి కారణం వారి వల్ల సమాచారం బయటకు వెళ్తుందని అనుమానం. ఈమధ్య ఈ పార్టీలలో డ్రగ్స్ వాడకం బాగా పెరగడంతోనే పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.