ఏపీలో ఎన్నికల వేళ అధికారులు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో భారీగా అక్రమ మద్యం, డ్రగ్స్ పట్టుబడుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల తనిఖీల్లో భాగంగా రూ.119 కోట్ల విలువైన అక్రమ మద్యం, డ్రగ్స్‌ను స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో(SEB) అధికారులు పట్టుకున్నారు.
Mumbai: నవీ ముంబై పోలీసులు ఓ ఫ్లాట్‌పై దాడి చేసి డ్రగ్స్ రాకెట్‌ను ఛేదించారు. అక్కడ నుంచి రూ.1.61 కోట్ల విలువైన కొకైన్, పలు మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నామని, దీనితో పాటు డ్రగ్స్ రాకెట్ నడుపుతున్న 11 మంది నైజీరియన్లను అరెస్టు చేశారు.
Noida : గ్రేటర్ నోయిడాలోని దాద్రీలో డ్రగ్స్ ఫ్యాక్టరీని పోలీసులు పట్టుకున్నారు. నలుగురు విదేశీయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పాటు కోట్లాది రూపాయల విలువైన డ్రగ్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు.
2kg Ganja seized in Hyderabad: హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ స్మగ్లింగ్ గుట్టు రట్టైంది. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ‘అమెజాన్’ కొరియర్ ద్వారా గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను మేడ్చల్ ఎస్ఓటీ టీమ్ పట్టుకుంది. అక్రమంగా తరలిస్తున్న 2 కేజీల గంజాయిని రంగారెడ్డి జిల్లా మేడ్చల్‌లో పోలీసులు సీజ్ చేశారు. ముఠాపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ నగరం గంజాయికి అడ్డాగా మారిన విషయం తెలిసిందే. Also Read: Medak Parliament:…
హైదరాబాద్ మహానగరంలో డ్రగ్స్, గంజాయిని నిర్మూలించేందుకు పోలీసు శాఖ చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే నగరంలో ప్రధాన కూడళ్లు, చెక్‌పోస్టులు, పబ్బులు, క్లబ్బుల్లో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. నిత్యం నగరంలోని ఏదో ఒక చోట డ్రగ్స్, గంజాయి పట్టుబడుతూనే ఉన్నాయి. తాజాగా రాచకొండ కమిషనరేట్ పరిధిలో గురువారం భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి.
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ను పట్టి పీడిస్తున్న భూతాల్లో ‘డ్రగ్స్’ ఒకటి. ముఖ్యంగా.. యువతీ యువకులు ఈ డ్రగ్స్‌కు బానిసలై, తమ ఉజ్వల భవిష్యత్తుని చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. ఇది చట్టవిరుద్ధమని తెలిసినప్పటికీ.. దుండగులు అడ్డదారుల్లో ఈ డ్రగ్స్‌ని సరఫరా చేస్తూనే ఉన్నారు. హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో ఎండీఎంఏ డ్రగ్స్‌ను రాజేంద్రనగర్ ఎస్వోటీ టీమ్ సీజ్ చేసింది.
హైదరాబాద్ లోని రాజేంద్రనగర్లో డ్రగ్స్ కలకలం రేపుతోంది. ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ వద్ద 15 గ్రాముల డ్రగ్స్ ను మాదాపూర్ ఎస్ఓటీ టీమ్ సీజ్ చేశారు. కారులో డ్రగ్స్ తరలిస్తుండగా మాటు వేసి పట్టుకున్నారు ఎస్ఓటీ అధికారులు. ఆ తర్వాత నిందితుడు ఇంట్లో సోదాలు నిర్వహించిన ఎస్ఓటీ బృందం.. నిందితుడు పాత నేరస్థుడుగా గుర్తించారు. దీంతో.. అతనిపై (NDPS) యాక్ట్ కింద కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. నిందితుడు రాజేంద్రనగర్ సన్ సిటీకి చెందిన సాఫ్ట్‌వేర్…
Drug Network: తెలంగాణ క్రమక్రమంగా డ్రగ్స్‌కు అడ్డాగా మారుతోంది. పంజాగుట్ట పోలీసులు పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుకున్నారు. దేశంలోనే అతి పెద్ద డ్రగ్స్ లింకును పోలీసులు ఛేదించారు.
బ్రెజిల్ శాంటోష్ పోర్ట్ నుంచి విశాఖ పోర్టుకు చేరుకున్న 25వేల కిలోల డ్రగ్స్ రాకెట్ పై సమగ్ర విచారణకు ఆదేశించాలని కేంద్ర ప్రభుత్వాన్ని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి డిమాండ్ చేశారు. విశాఖ పోర్టులో తనిఖీలకు వచ్చిన సీబీఐ, కస్టమ్స్ అధికారులను కంటైనర్ తెరవకుండా ఆపడానికి పోలీసులు ఎందుకు ప్రయత్నం చేశారని ప్రశ్నించారు. డ్రగ్స్ దిగుమతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, ప్రభుత్వ పెద్దల హస్తం లేకుండానే ఇన్ని వేల కోట్ల మాదకద్రవ్యాలను డ్రై…
జగిత్యాల జిల్లాలో గంజాయి మూలాలు కలకలం రేపుతున్నాయి. పదవ తరగతి విద్యార్థినులు గంజాయికి బానిసైన విషయం విస్మయానికి గురి చేస్తుంది. జగిత్యాలలో విద్యార్థినులు గంజాయి మత్తులో చిత్తు అవుతున్నారు. తమ బంగారు భవిష్యత్తును చేజేతులా పాడు చేసుకుంటున్నారు. ముఖ్యంగా పదవ తరగతి చదివే విద్యార్థులు అధిక మొత్తంలో గంజాయికి బానిస అయ్యారు. ఈ విషయాన్ని ఓ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.