Bengaluru : బెంగళూరులో ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని ఫామ్‌హౌస్లో జరిగింది. జీఆర్ ఫామ్‌హౌస్‌లో బర్త్ డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవ్ పార్టీని నిర్వహించారు. ఈ రేవ్ పార్టీలో మందుతో పాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ వాడినట్లు తెలుస్తోంది. జీఆర్ ఫామ్‌హౌస్ అనేది హైదరాబాద్‌కు చెందిన గోపాల్ రెడ్డికి చెందినదిగా పోలీసుల దర్యాప్తులో తేలింది. తెల్లవారుజామున 3గంటల వరకు జరుగుతున్న రేవ్ పార్టీపై పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో సంచలన విషయాలు వెలుగు చూశాయి.
రేవ్ పార్టీలో పోలీసులకు భారీ ఎత్తున డ్రగ్స్, కోకైన్ లభ్యమయ్యాయి. ఈ పార్టీలో 17 ఎండీఎంఏ ట్యాబ్లెట్లు, కొకైన్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దీనిలో ముఖ్యంగా తెలుగు రాష్టాలకు చెందిన వారే అధికంగా ఉన్నట్లు బెంగుళూరు పోలీసులు గుర్తించారు. ఆంధ్రా, బెంగళూరుకు చెందిన 100 మందికి పైగా పార్టీలో దొరికిపోయారు. పార్టీలో 25 మందికి పైగా యువతులు ఉన్నారు. వీరందినీ పార్టీ కోసం ఆంధ్రా నుంచి విమానంలో నిర్వాహకులు ఆహ్వానించారు. ఈ ఫామ్ హౌస్ కాన్ కార్డ్ యజమాని గోపాల రెడ్డిగా పోలీసులు నిర్ధారించారు. హైదరాబాద్‌కు చెందిన వాసు పార్టీ ఏర్పాటు చేశారు. ఘటనా స్థలంలో పదిహేనుకు పైగా కార్లు లభ్యమయ్యాయి. అందులో ఐషారామి మెర్సిడెస్ బెంజ్, జాగ్వార్. ఆడి లాంటి కాస్ట్లీ కార్లు ఉన్నాయి. పోలీసులు జరిపిన సోదాల్లో బెంజ్ కారులో ఆంధ్రా ఎమ్మెల్యే కాకాణి గోవర్ధనరెడ్డి పేరిట పాస్‌పోర్టు దొరికింది.
Read Also:SIT Team: ఏపీలో పోలింగ్ అనంతరం జరిగిన అల్లర్లపై మరిన్ని కేసులు నమోదు..
ఆదివారం సాయంత్రం ఐదు గంటల నుంచి సోమవారం ఉదయం ఆరు గంటల వరకు పార్టీ జరిగింది. ఈ విషయంపై ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. సిటీ లోపల సీసీబీ దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఔటర్ జోన్‌లో పార్టీ ప్లాన్ చేశారు. ఒక్కరోజు పార్టీ కోసం ముప్పై నుంచి యాభై లక్షలు ఖర్చు చేయనున్నారు. ప్రస్తుతం నార్కోటిక్ స్నిఫర్ డాగ్స్ ద్వారా స్థలాన్ని తనిఖీ చేస్తున్నారు. పార్టీలో పాల్గొన్న వారిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఈ రేవ్ పార్టీకి చాలా మంది సెలబ్రిటీలు కూడా హాజరైనట్టు చెప్తున్నారు. టాలీవుడ్‌కి చెందిన కొందరిని పోలీసులు విచారిస్తున్నట్టు సమాచారం.
మంత్రి కాకాణి కామెంట్స్..
బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో దొరికిన కారు తో నాకు సంబంధం లేదని మంత్రి కాకాణి స్పష్టం చేశారు. కారు పై స్టిక్కర్ ఒరిజినలా లేదా ఫోటో కాపీన అనే విషయాన్ని పోలీసులు పోలీసుల విచారణలో తేలుతుంది. 2023 తో ఆ స్టికర్ కాల పరిమితి ముగిసిందని తెలిపారు.
Read Also:Ponguleti Srinivasa Reddy: ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు పూర్తి చేసే బాధ్యత నాది..