Supreme Court: “బిల్లుల ఆమోదానికి రాష్ట్రపతికి గడువు విధించలేం”.. సుప్రీం సంచలన తీర్పు..
- బిల్లుల ఆమోదానికి రాష్ట్రపతికి గడవు విధించలేము..
- బిల్లుల విషయంలో గవర్నర్‌కు 3 మార్గాలు ఉన్నాయి.
- సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులపై రాష్ట్రపతి, గవర్నర్ అధికారాలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘‘బిల్లులను ఆమోదించడానికి రాష్ట్రపతి, గవర్నర్లకు కాలపరిమితి లేదు’’ అని అత్యున్నత న్యాయస్థానం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. బిల్లుల ఆమోదం విషయంలో రాష్ట్రపతికి గడువు విధించలేమని స్పష్టం చేసింది. గవర్నర్లు బిల్లులు సుదీర్ఘకాలం ఆమోదించకుంటే రాజ్యాంగ కోర్టులకు న్యాయ సమీక్ష అధికారం ఉందని చెప్పింది. తాము గవర్నర్లకు పరిమిమైన సూచనలు మాత్రమే ఇవ్వగలని వ్యాఖ్యానించింది.
Read Also: Eric Trump: జోహ్రాన్ మమ్దానీ ‘‘భారతీయ’’ ద్వేషి.. ట్రంప్ కుమారుడి సంచలన వ్యాఖ్యలు..
Also Read
- BrahMos Missile Export: డిఫెన్స్ రంగంలో భారత్ సత్తా.. బ్రహ్మోస్ ఎగుమతులతో గ్లోబల్ మార్కెట్లో దూకుడు
- Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
- Maharashtra Tragedy: బీచ్ ట్రిప్‌లో విషాదం.. నీటిలో మునిగి 8 మంది స్టూడెంట్స్ మృతి..
- CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం ఆగదు’’.. సీజేపీ హెచ్చరిక!
బిల్లుల ఆమోదం విషయంలో గవర్నర్ ముందు 3 మార్గాలు మాత్రమే ఉన్నాయని- ఆమోదించడం, రాష్ట్రపతికి పంపడం, నిలుపుదల చేసి అసెంబ్లీకి తిరిగి పంపడం గవర్నర్ అధికారాలు అని చెప్పింది. బిల్లులపై మూడు నెలల గడవు విధించి తీర్పుపై సుప్రీంకోర్టుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 14 ప్రశ్నల్ని సంధించారు. ఆర్టికల్ 143 కింద సుప్రీంకోర్టు రిఫరెన్స్‌ను రాష్ట్రపతి అడిగారు. రాష్ట్రపతి రిఫరెన్స్ పై వాదనలు విన్న సీజేఐ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం, సెప్టెంబర్‌లో తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా ఈ రోజు తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది.
సీజేఐ గవాయ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనంలో న్యాయమూర్లులు సూర్యకాంత్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ ఏఎస్ చందుర్కర్ ఉన్నారు. రాష్ట్రపతి, గవర్నర్లకు న్యాయవ్యవస్థ గడువు విధించడం సరికాదని కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పాలిత రాష్ట్రాలు వాదనలు వినిపించాయి. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారి విచక్షణాధికారాల్లో జోక్యం చేసుకోవడం పరిధిని అతిక్రమించడమే అని కేంద్రం కోర్టుకు తెలిపింది. మరోవైపు.. రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించడాన్ని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు సమర్థించాయి. జస్టిస్ గవాయ్ రిటైర్మెంట్‌కు కొన్ని రోజుల ముందు ఈ సంచలన తీర్పు వచ్చింది. తమిళనాడు గవర్నర్ బిల్లును ఉద్దేశపూర్వకంగా తొక్కిపెడుతున్నారని డీఎంకే సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఈ కేసు మొదలైంది.
తాజావార్తలు
-
BKU : ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న ఇండస్ట్రీ హిట్ సినిమా ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
-
BrahMos Missile Export: డిఫెన్స్ రంగంలో భారత్ సత్తా.. బ్రహ్మోస్ ఎగుమతులతో గ్లోబల్ మార్కెట్లో దూకుడు
-
Astrology: అక్టోబర్ 02 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశులవారికి అంతా శుభమే..!
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?