Electric Cars: వర్షాకాలంలో ఎలక్ట్రిక్ కార్లను జాగ్రత్తగా చూసుకోవాలి… నీటితో నిండిన రోడ్లపై డ్రైవింగ్ వద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Electric Cars: వర్షాకాలం ఎలక్ట్రిక్ వాహనాలతో జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎక్కడ నీళ్లు ఉంటే.. అక్కడ జాగ్రత్తగా వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. వర్షాకాలం కాబట్టి ఎక్కువ నీరు రోడ్ల మీద ఉన్నప్పుడు ఎలక్ర్టిక్ కార్లతో జాగ్రత్తగా ఉండాలని.. ఎక్కువగా నీళ్లు నిలిచిన రోడ్లపై నుంచి వెళ్లకుండా ఉండటమే ఉత్తమమని చెబుతున్నారు. అలాగే వర్షాకాలంలో ఎలక్ర్టిక్ కార్లకు తీసుకోవల్సిన జాగ్రత్తల గురించి నిపుణులు ఇలా చెబుతున్నారు..
Read also: Attack On Indian Consulate: శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్‌పై ఖలిస్తాన్ మద్దతుదారుల దాడి
Also Read
- రూ.2,254 నుంచి రూ.984! ఒక్క దెబ్బతో 5 ఏళ్ల లాభాలు స్వాహా.. PB ఫిన్‌టెక్‌ను ముంచేసిందెవరు?
- SSY, PPF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. కొత్త వడ్డీ రేట్లు ఇవే! మీ పెట్టుబడిపై ఎంత లాభం వస్తుందంటే?
- Sugar Stock Limit: షుగర్ వ్యాపారులకు షాక్.. నిల్వలపై కేంద్రం కొత్త నిబంధనలు
- UPI Charges: అక్టోబర్ 2న ‘నో UPI డే’.. అసలు ఏం జరుగుతుంది?
వానాకాలం ప్రారంభం చాలా మంది కారు ఓనర్లకు ఆందోళన కలిగిస్తుంది. రోడ్లు నీటితో నిండిపోవడమే కాకుండా, బేస్‌మెంట్ పార్కింగ్ స్థలాలు, కొన్ని ప్రదేశాలలో కూడా నీరు నిలిచి, చాలా వాహనాలకు నష్టం కలిగిస్తుంది. అయితే భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల సంఖ్య వేగంగా పెరుగుతోంది. దీంతోపాటు వర్షాకాలంలో ఎలక్ట్రిక్ కార్ల యజమానుల ఆందోళన ఇంకా పెరుగుతుంది. వర్షాకాలంలో EVని సురక్షితంగా, మంచి స్థితిలో ఉంచాలనుకుంటే ఈ నాలుగు సులభమైన చిట్కాలను వాడాలని సూచిస్తున్నారు. వర్షాకాలంలో ఎలక్ట్రిక్ వాహనాన్ని నిర్వహించడంలో మొదటిది ప్రధానమైన దశ ఛార్జింగ్ పరికరాలను సురక్షితంగా ఉంచడం. మీరు బయట ఛార్జింగ్ స్టేషన్‌ని సెటప్ చేసి ఉంటే లేదా పోర్టబుల్ ఛార్జర్‌ని ఉపయోగించినట్లయితే ఇది చాలా అవసరం, ఎందుకంటే పరికరంలోని నీరు షార్ట్ సర్క్యూట్‌కు కారణమవుతుంది. అలాగే బ్యాటరీ ఆరోగ్యాన్ని తనిఖీ చేసుకోవాలి. ఎలక్ట్రిక్ కారులో బ్యాటరీ ముఖ్యమైన భాగం కాబట్టి దాని ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఏదైనా ఇన్సులేషన్ లేదా కనెక్టర్ నష్టం కోసం తరచుగా తనిఖీ చేయాలి. అసాధారణంగా ఏదైనా గమనించినట్లయితే, కారుని ప్రారంభించకుండా సర్వీస్ సెంటర్ కు కాల్ చేయడం మంచిదని సూచిస్తున్నారు.
Read also: TS BJP: బండిపై రఘునందన్ వ్యాఖ్యలు.. హైకమాండ్ కు చేరిన ఇష్యూ
కారు లోపల ఉన్న ఇంటీరియర్‌ను శుభ్రంగా ఉంచుకోవాలి. కారు లోపలి భాగం కూడా ముఖ్యమైనదే. కారు లోపల నీరు లేదా తేమ కూడా విద్యుత్ సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి లోపలి భాగాన్ని శుభ్రంగా ఉంచండి. తలుపులు, కిటికీలు సరిగ్గా మూసుకుపోతున్నాయా.. లేకపోతే లీక్‌లు ఏమైనా ఉన్నాయని నిర్ధారించుకుంటే.. అటువంటి వాటిని పూర్తి చేసుకోవాలి. ఇక ప్రధానమైంది..నీటితో నిండిన రోడ్లపై డ్రైవింగ్ చేయడం మానుకోవడం ఉత్తమం. వానా కాలంలో ఎలక్ట్రిక్ కారుతో, రెట్టింపు జాగ్రత్తతో ఉండాలి. నీరు అనుకున్నదానికంటే ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి EVలు చాలా సున్నితమైన ఎలక్ట్రానిక్స్, సెన్సార్‌లను కలిగి ఉంటాయి. కాబట్టి వాటిని పాడు చేయడం సులభం. అలాగే బ్యాటరీ ప్యాక్ IP రేటింగ్‌ను తెలుసుకోవాలి. రోడ్లపై నీటి ముంపు ఉంటే , మరొక మార్గాన్ని ఎంచుకొని వెళ్లడం ఉత్తమం అని సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
-
Shaikpet Flyover : షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై నుంచి పడ్డ పైపు.. స్కూటర్ నజ్జునుజ్జు
-
Houthi vs Saudi: ‘‘హౌతీలు ఇస్లాంకు శత్రువులు’’.. సౌదీకి అండగా ఉండాలని పాక్ మతగురువు పిలుపు
-
Droupadi Murmu: గుజరాత్ యూసీసీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం.. ఏఏ నిబంధనలు అమల్లోకి వస్తాయో తెలుసా!
-
Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!