తెలంగాణా మాజీ మంత్రి మల్లారెడ్డి గురించి ఎంత చెప్పినా తక్కువే.. అధికారంలో ఉన్నా లేకున్నా ఆయనకు నచ్చినట్లు చేస్తాడు.. ఎవ్వరికి భయపడడు.. ఎక్కడా తగ్గడు.. ఈవెంట్ ఏదైనా ఆయన మాటలకు ఫిదా అవ్వాల్సిందే.. అలాంటి ఎమ్మెల్యే మల్లారెడ్డి మొన్న గోవాలో ఆయన చేసిన విన్యాసాలు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయ్యాయో చూసాము… నేడు దుబాయ్ లో బీచ్ లో ఎంజాయ్ చేస్తూ ఫోటోలకు పోజులు ఇచ్చారు.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
అప్పుడు మంత్రిగా ఉన్నా, ఇప్పుడు ఎమ్మెల్యే గా ఉన్న కూడా ఆయనకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ మాత్రం తగ్గలేదు.. మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి.. సోషల్ మీడియా ఫాలోయింగ్ తగ్గట్టుగానే ఆయన కూడా కంటెంట్ ఇస్తూనే ఉంటారు. తాజాగా ఎలక్షన్స్ తర్వాత రిలాక్స్ అవ్వడానికి ఎమ్మెల్యే మల్లన్న గోవాకు వెళ్లారు.. కొంతమంది నేతలతో గోవాలో ఎంజాయ్ చేస్తూ వీడియోలు రిలీజ్ చేశారు. సముద్ర తీరంలో ఎంజాయ్ చేస్తూ కేరింతలు కొట్టారు.. సముద్రంలో పారా స్లైడింగ్ చేస్తూ హుషారుగా కనిపించారు..
ఇక ఇప్పుడు మేడ్చల్ మున్సిపల్ బీఆర్‌ఎస్ నేతలతో కలిసి మల్లారెడ్డి దుబాయ్ కి వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ ఉన్న తెలుగువారితో ముచ్చటిస్తూ..అక్కడ అందాలను ఆస్వాదిస్తూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియా లో హల్‌చల్ చేస్తున్నాయి. ఎమ్మెల్యే మల్లారెడ్డితో పాటు కౌన్సిలర్లు, మహిళా కౌన్సిలర్ల భర్తలు దుబాయ్‌లో ఆయా ప్రాంతాలను వీక్షిస్తున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. తెలంగాణ ప్రాంతాల నుంచి ఉపాధి కోసం దుబాయ్ వెళ్లి జీవనోపాధి పొందుతున్న కార్మికులతో మల్లారెడ్డి మాట్లాడి వారి జీవన స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు.. ఆ తర్వాత అక్కడ ఉన్న ఎడారి లో డ్రైవ్ చేస్తూ మల్లారెడ్డి ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ పిక్స్ , వీడియోస్ చూసిన అభిమానులు మల్లారెడ్డి ఎక్కడికి వెళ్లిన హడావిడి, ఎంజాయ్ మాత్రం తగ్గదు అని కామెంట్స్ చేస్తున్నారు..
దుబాయ్ విహార యాత్రలో మాజీ మేడ్చల్
ఏమ్మెల్యే @chmallareddyMLA pic.twitter.com/rOoFntrA1s— HEMA (@Hema_Journo) January 18, 2024