దర్శకుడు మోహన్.జి తెరకెక్కిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘ద్రౌపది 2’ బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి రంగం సిద్ధమవుతోంది. 14వ శతాబ్దపు దక్షిణ భారతదేశ నేపథ్యంతో రూపొందుతున్న ఈ సినిమా, అనౌన్స్‌మెంట్ నుంచే సినీ ప్రియుల్లో భారీ క్యూరియాసిటీని రేకెత్తిస్తోంది. తాజాగా ఈ సినిమా సెన్సార్‌ను పూర్తి చేసుకుని U/A సర్టిఫికేట్ పొందడంతో ప్రమోషన్ల జోరు పెరిగింది.