పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా భారతదేశం పాకిస్థాన్‌తో వాణిజ్య సంబంధాలను నిలిపివేసింది. దీంతో పాకిస్థాన్‌లో మందుల కొరత లేకుండా చూసుకోవడానికి ప్రభుత్వం అత్యవసర చర్యలు ప్రారంభించింది. మరోవైపు.. సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయాలని భారత్ తీసుకున్న నిర్ణయానికి ప్రతిస్పందనగా.. ఇస్లామాబాద్ కూడా న్యూఢిల్లీతో అన్ని వాణిజ్యాలను నిలిపివేసింది. కానీ ఔషధాల దిగుమతుల అంశంపై మాత్రం ఇంత వరకు అధికారిక ప్రకటన వెలువడ లేదు. ఎందుకంటే పాకిస్థాన్ భారత్ నుంచి వచ్చే మందులుపై ఆ