కరోనా మహమ్మారి నుంచి ప్రపంచదేశాలు ఇప్పుడిప్పుడే కాస్త ఊపిరి పీల్చుకుంటున్నాయి. అలాగని ఇది పూర్తిగా కనుమరుగవ్వలేదు. ఇంకా కొన్ని దేశాల్లో దీని ఉధృతి కొనసాగుతోంది. కాకపోతే, పరిస్థితి మునుపటిలా మరీ తీవ్రంగా అయితే లేదు. ఇంతలో మంకీపాక్స్ వైరస్ ప్రపంచాన్ని కలవరపెడుతోంది. పలు దేశాల్లో ఈ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. వ్యాప్తి కూడా వేగంగా జరుగుతోంది. దీంతో, ఇది మరో కరోనా మహమ్మారి కానుందా? భారీ స్థాయిలో మరణాలు సంభవిస్తాయా? లాక్డౌన్ లాంటి పరిస్థితులు వస్తాయా? అనే…