ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఎస్.గోపాల్ రెడ్డి, ఆయన మిత్రుడు డాక్టర్ కె.యల్.నారాయణ కలసి అనేక జనరంజకమైన చిత్రాలు నిర్మించారు. జగపతిబాబు, సౌందర్య జంటగా వారు నిర్మించిన ‘దొంగాట’ సైతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. 1997 జూలై 11న ‘దొంగాట’ చిత్రం విడుదలయింది. ‘దొంగాట’ కథ ఏమిటంటే – అమాయకురాలైన పల్లెటూరి సుబ్బలక్ష్మి తన బావ ప్రకాశ్ ను ఎంతగానో ప్రేమిస్తుంది. అతను పై చదువులకు పట్నం వెడతాడు. బావకోసం ఎదురుచూపులు చూసిన సుబ్బలక్ష్మి ఓ సారి అతడిని ఎలాగైనా కలుసుకోవాలని…