గుండెపోటుతో మృతిచెందిన తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి పార్థివ దేహానికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నివాళులు అర్పించారు. అనంతరం శేషాద్రి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా సీజేఐ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైన శేషాద్రి ఇక లేరన్న విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని తెలిపారు. శేషాద్రి స్వామితో తనకు 25 ఏళ్ల అనుబంధం ఉందన్నారు. శేషాద్రి మరణం వ్యక్తిగతంగా తనకు తీరని లోటు అని ఎన్వీ రమణ…
డాలర్ శేషాద్రి అంతిమ సంస్కారాలు ఇవాళ తిరుపతిలో జరగనున్నాయి. ఆయన పార్థివదేహం విశాఖ నుంచి తిరుపతికి చేరుకుంది. సిరిగిరి అపార్ట్‌మెంట్‌లో భక్తుల సందర్శనార్థం ఉంచుతారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి 3 గంటల వరకు పూజలు నిర్వహించి.. తిరుపతి గోవింద ధామంలో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. సుప్రీంకోర్టు సీజేఐ ఎన్వీ రమణ… తిరుమల రానున్నారు. డాలర్ శేషాద్రి పార్థివదేహానికి నివాళులు అర్పించనున్నారు. తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి సోమవారం తెల్లవారుజామున మృతిచెందారు. విశాఖపట్నంలో కార్తీక…
శ్రీవారి ఆలయ వోఎస్డీ డాలర్ శేషాద్రి హఠాన్మరణం చెందారు. విశాఖపట్నంలో కార్తీక దిపోత్సవం కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన.. ఇవాళ వేకువజామున గుండెపోటు రావడంతో కన్నుమూశారు.. సుదీర్ఘ సమయం శ్రీవారి సేవలో తరించిన భాగ్యం ఆయనకే దక్కింది.. 1978 నుంచి డాలర్ శేషాద్రి శ్రీవారి సేవలో ఉన్న ఆయన.. 2007లో రిటైర్ అయినా.. శేషాద్రి సేవలు తప్పనిసరికావడంతో వోఎస్డీగా టీటీడీ కొనసాగించింది.. ఆయన జీవితంలో చివరి క్షణాల వరకు శ్రీవారి సేవలోనే ఉన్నారు.. ఇక, ఆయన మృతికి…
రేపు మధ్యాహ్నం డాలర్ శేషాద్రి అంతిమ సంస్కారాలు జరుగనున్నాయని సమాచారం అందుతోంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు రోడ్డు మార్గాన వైజాగ్ నుంచి తిరుపతికి డాలర్ శేషాద్రి పార్థివ దేహాన్ని తరలించనున్నారు. ఇక ఇవాళ అర్దరాత్రికి తిరుపతికి చేరుకోనుంది ఆయన పార్దివ దేహం. రేపు ఉదయం ప్రజల సందర్శనార్దం… తిరుపతిలోని సిరిగిరి అపార్ట్మెంట్ లో డాలర్ శేషాద్రి పార్థివ దేహాన్ని ఉంచేలా ఏర్పాట్లు చేయనున్నారు. ఇక రేపు మధ్యాహ్నం 2 నుంచి 3 గంటలకు వరకు పూజలు…
తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. దీంతో ఆయనకు పలువురు ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఆయన మృతిపై విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి స్పందించారు. డాలర్ శేషాద్రితో శారదా పీఠానికి సుదీర్ఘకాలం అనుభవం ఉంటుందన్నారు. తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించిన ప్రతి ఒక్కరికీ డాలర్ శేషాద్రి సుపరిచితులు అని స్వరూపానందేంద్ర అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది డాలర్ శేషాద్రి ఆప్యాయతను పొందారని.. ఆయన హఠాన్మరణం తన హృదయాన్ని కలచివేసిందని తెలిపారు.…
తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి గుండెపోటుతో సోమవారం వేకువజామున తుదిశ్వాస విడిచారు. ఆస్పత్రికి తీసుకువెళ్లేలోపే ఆయన కన్నుమూశారని సన్నిహితులు వెల్లడించారు. డాలర్ శేషాద్రి విశాఖలో కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లగా ఈ ఘటన జరిగింది. 1978వ సంవత్సరం నుంచి శ్రీవారి సేవలో డాలర్ శేషాద్రి పాల్గొంటున్నారు. 2007లో రిటైర్మెంట్ అయినా….శేషాద్రి సేవలు టీటీడీకి తప్పనిసరి కావడంతో ఓఎస్‌డీగా కొనసాగుతున్నారు. మరణించే చివరి క్షణం వరకు శ్రీవారి సేవలో ఆయన తరించారు. కాగా డాలర్…