అడవికి రాజు సింహం. సింహం ఎదురుగా వస్తుంటే అన్ని జంతువులు భయపడి పారిపోతుంటాయి. అయితే, ఓ చిన్న జంతువు సింహాన్ని ఎదిరించి నిలబడింది. గాంభీర్యంగా నిలబడి ఉన్న సింహాన్ని తనదైన శైలిలో భయపెట్టింది. అక్కడి నుంచి పారిపోయేలా చేసింది గ్రామంసింహం. గ్రామ సింహాలు అని కుక్కల్ని పిలుస్తారు. ఊర్లోకి ఎవరైన కొత్త వ్యక్తులు ప్రవేశిస్తే వెంటపడి కరుస్తాయి. లేదంటే పెద్దగా అరిచి భయపెడుతుంటాయి. అడవిలో ఉన్న ఓ సింహం రోడ్డు మీదకు వచ్చింది. అలా వచ్చిన సింహాన్ని…
డబ్బుకోసమో, కోపతాపాలతోనో మనుషులు కిడ్నాప్ వ్యవహారాలకు పాల్పడుతుంటారు. మనుషులను కిడ్నాప్ చేయడం లేదా, పెంపుడు జంతువులను కిడ్నాప్ చేయడం చేస్తుంటారు. మనుషులు మాత్రమే కాదు మేము కూడా కిడ్నాప్ చేయగలమని నిరూపించింది ఓ కోతి. ఓ చిన్న కుక్కపిల్లని కిడ్నాప్ చేసి మూడు రోజులపాటు తనవద్దనే బందీగా ఉంచుకొని స్థానికులకు చుక్కలు చూపించింది. ఈ సంఘటన మలేషియాలోని తమన్ లెస్టారిపుత్రలో జరిగింది. ఓ కోతి రెండు వారాల వయసున్న చిన్న కుక్కపిల్లను కిడ్నాప్ చేసి అడవిలోని చెట్లను…
బిజీగా ఉండే పారిశ్రామికవేత్తల్లో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవారు ఉన్నారు.. దీంట్లో ముందు వరుసలో ఉంటారు.. ఆనంద్ మహేంద్ర.. ఆయన సోషల్ మీడియా వేదికగా చాలా విషయాలపై స్పందిస్తుంటారు.. ఇక, అప్పుడప్పుడు ఇతర పారిశ్రామికవేత్తలు కూడా సందర్భాన్ని బట్టి తన అభిప్రాయాలను పంచుకుంటున్నారు.. తాజాగా రతన్ టాటాను ఓ ఫొటో ఆకట్టుకుంది.. పెట్స్ అంటే ఎంతో ఇష్టపడే టాటా.. ఆ ఫొటోలోని సన్నివేశాన్ని చూసి స్పందించకుండా ఉండలేకపోయారు.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఆ ఫొటోను షేర్…
సాధారణంగా పెంపుడు కుక్కలను విమానంలో అనుమతించరు. కానీ, ఇండియాలో ఏయిర్ ఇండియా సంస్థ ఒక్కటే పెంపుడు కుక్కలను బిజినెస్ క్లాస్‌లో అనుమతిస్తుంది. విమానంలో బిజినెస్ క్లాస్‌లో పెంపుడు జంతువులను తీసుకెళ్లడానికి టికెట్ సుమారు రూ.20 వేల వరకు ఉంటుంది. గరిష్టంగా రెండు పెంపుడు కుక్కలను తీసుకెళ్లవచ్చు. అయితే, ముంబై నుంచి చెన్నై వెళ్లేందుకు ఓ వ్యాపారి తన పెంపుడు కుక్కపిల్ల కోసం ఏకంగా 12 బిజినెస్ క్లాస్ టికెట్లను బుక్ చేసుకున్నాడు. బిజినెస్ జే క్లాస్‌లో 12…
విశ్వాసానికి ప్రతీక శునకం. ఒక్కరోజు దానికి ఆహారం పెడితే చాలు… ఎంతో విశ్వాసాన్ని చూపుతుంటాయి. ఇక కొన్ని శునకాలు యజమాలను చెప్పిన విధంగా ఉంటూ అన్ని పనుచు చేస్తుంటాయి. అన్నింటిలోకి ఈ శునకం వేరు అంటున్నారు దాస్ ఫెర్నాండేజ్. తమిళనాడులోని దిండిగల్ జిల్లా పళనికి చెందిన దాస్ ఫెర్నాండేజ్ లాబ్రడార్ జాతికి చెందిన శునకాన్ని పెంచుతున్నాడు. దానికి బయటకు వెళ్లి సరుకులు ఎలా తీసుకురావాలో నేర్పించాడు. యజమాని చీటీ రాసి బుట్టను మెడకు తగిలించి పంపిస్తే చాలు……
కాపలాగా ఉండాల్సిన ఓ శునకం యజమానికి తిప్పలు తెచ్చిపెట్టింది. యజమానే శునకానికి కాపలాగా ఉండాల్సిన దుస్థితి ఏర్పడింది. కర్ణాటకలోని కొప్పళ్ల జిల్లాలోని కారటిగి పట్టణానికి చెందిన దిలీప్ అనే వ్యక్తి ఇంటికి కాపలాగా ఉంటుందని చెప్పి 5వేలు పెట్టి ఓ శునకాన్ని తెచ్చుకున్నాడు. అయితే, ఆ శునకం ఏకంగా యజమాని బంగారం గొలుసును మింగేసింది. గొలుసు కనిపించకపోవడంతో దిలీప్ ఇళ్లంతా వెతికాడు. చివరకు కుక్కను కట్టేసిన ప్రాంతంలో చిన్నచిన్న బంగారం ముక్కలు కనిపించడంతో షాక్ అయ్యాడు. తరువాత…
కుక్కపిల్ల కొనివ్వలేదని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విశాఖలోని వెంకటేశ్వర మెట్ట ప్రాంతానికి చెందిన షణ్ముక వంశీ (16) సూసైడ్ తో ఫ్యాన్‌కు ఉరివేసుకొని చనిపోయాడు. ఇటీవలే ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ జాయిన్ అయిన వంశీ.. ఆన్‌లైన్‌లో చూసిన రూ.30వేల విలువైన కుక్కపిల్ల కావాలని తల్లిని అడిగాడు. కొన్నిరోజుల తర్వాత కొందామని చెప్పిన వినకుండా మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం తల్లి బయటకు వెళ్లిన సమయంలో ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడగా.. విశాఖ కేజీహెచ్‌కు తరలించగా…
మధ్యప్రదేశ్ ఇండోర్ కు చెందిన ఓ వ్యక్తి తన కుటుంబ సభ్యులను పొరుగింటివారి పెంపుడు కుక్క కరిచిందని తెలిసి.. దాన్ని తుపాకీతో కాల్చి చంపేశాడు. దీంతో ఆగ్రహానికి గురైన పొరిగింటివారు పోలీస్ కేసు పెట్టారు. అనంతరం ఈ ఘటనకు కారణమైన వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. సెక్షన్ 429 జంతువుల పట్ల క్రూరత్వం కింద అతనిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అయితే ఆ కుక్కను కాల్చిన నిందితుడు.. తన భార్యకు, విధుల్లోకి వారందరికీ చేసిన…
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు… అనే మాట అక్షర సత్యం. ఎక్కడ ఎలాంటి ప్రమాదం పొంచి ఉంటుందో, ఎటు నుంచి ప్రమాదం దూసుకొస్తుందో ఎవరూ చెప్పలేరు. ప్రతి నిమిషం జాగ్రత్తగా, అంతకు మించి అలర్ట్ గా ఉండాలి. రోడ్డుపై తిరిగే మనిషి నుంచి అడవుల్లో సంచరించే జంతువుల వరకు ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంటేనే ప్రాణాలు నిలుస్తాయి. ఏమరుపాటుగా ఉంటే ఈ శునకంలా ప్రాణాలు కోల్పోవలసి వస్తుంది. దాహం తీర్చుకోవడానికి ఓ శునకం నది ఒడ్డుకు…