కుక్కపిల్ల కొనివ్వలేదని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విశాఖలోని వెంకటేశ్వర మెట్ట ప్రాంతానికి చెందిన షణ్ముక వంశీ (16) సూసైడ్ తో ఫ్యాన్‌కు ఉరివేసుకొని చనిపోయాడు. ఇటీవలే ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ జాయిన్ అయిన వంశీ.. ఆన్‌లైన్‌లో చూసిన రూ.30వేల విలువైన కుక్కపిల్ల కావాలని తల్లిని అడిగాడు. కొన్నిరోజుల తర్వాత కొందామని చెప్పిన వినకుండా మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం తల్లి బయటకు వెళ్లిన సమయంలో ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడగా.. విశాఖ కేజీహెచ్‌కు తరలించగా అప్పటికే వంశీ చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.