Doctors Protest: పశ్చిమ బెంగాల్‌లో ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీలో రెండవ సంవత్సరం మహిళా ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం- హత్యకు వ్యతిరేకంగా జూనియర్ డాక్టర్లు గత 65 రోజులుగా నిరసనలు చేస్తున్నారు. వారికి మద్దతుగా నేటి (అక్టోబర్ 14) నుంచి ఎలక్టివ్ సర్వీసులను బహిష్కరించాలని ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ ఆదివారం దేశవ్యాప్తంగా వైద్య సంఘాలు, రెసిడెంట్ డాక్టర్లను కోరింది.
Kolkata Rape Case: కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌కు చెందిన యువ వైద్యురాలిపై అత్యాచారం, హత్య కేసులో న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లు సమ్మెను విరమించారు. అయితే వారు తమ డిమాండ్లను నెరవేర్చడానికి ప్రభుత్వానికి 24 గంటల గడువు ఇచ్చారు. ఆరోగ్య శాఖ కార్యదర్శి నారాయణ్ స్వరూప్ నిగమ్‌ను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం, కోల్‌కతాలోని ధర్మటాలకు చెందిన జూనియర్ డాక్టర్ దేబాశిష్ హల్దర్…
ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో జూనియర్ డాక్టర్ల చర్చలపై ప్రతిష్టంభన చోటుచేసుకుంది. గురువారం సాయంత్రం 5 గంటలకు చర్చలకు రావాలని డాక్టర్లకు ప్రభుత్వం ఆహ్వానం పంపింది. అయితే షరతులతో కూడిన ఆహ్వానం పంపించింది. దీంతో వైద్యులు చర్చలకు వచ్చేందుకు నిరాకరించారు.
డాక్టర్ల సమ్మె పై మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. రెసిడెంట్, జూనియర్ డాక్టర్లను ఈటల విజ్ఞప్తి చేసారు. ”మొన్నటి వరకు మీ కుటుంబ సభ్యునిగా ఉన్న నేను ప్రజల తరపున మీకో విజ్ఞప్తి. కరోనా కష్ట కాలంలో మీరు అందించిన సేవలు చరిత్రలో నిలిచిపోతాయి. ప్రాణాలకు సైతం తెగించి చికిత్స అందించి ప్రజల ప్రాణాలు కాపాడారు. కరోనా మహమ్మారి ఇంకా పోలేదు ఇలాంటి సమయంలో మీరు సమ్మె కు దిగితే పేద…