(ఏప్రిల్ 9న ‘డాక్టర్ – సినీయాక్టర్’కు 40 ఏళ్ళు) తాను అభిమానించే వారినే ఎవరైనా ఆదర్శంగా తీసుకుంటారు. ఓ దశకు వచ్చాక వారితోనే పోటీపడాలనీ ఆశిస్తారు. ఎందుకంటే, తన ఆదర్శమూర్తితో తాను సరితూగాలని ప్రతి అభిమానికీ అభిలాష ఉంటుంది. అలాంటి కోరికతోనే హీరో కృష్ణ చిత్రసీమలో అడుగు పెట్టారు. చిన్నతనంలో తాను ఎంతగానో అభిమానించిన మహానటుడు యన్టీఆర్ తో కలసి నటించారాయన. ఆ సంతోషం చాలక, రామారావు సినిమాలు విడుదలయ్యే సమయంలోనే తన చిత్రాలనూ రిలీజ్ చేసి…