వచ్చే ఎన్నికల్లో DMK ఓటమి తథ్యం అని జోస్యం చెప్పారు. పాలారు నదిలో కోట్లాది రూపాయల ఇసుకను దోచేశారు.. ఇసుక దోపిడీ సహా ఎన్నో రకాలుగా డీఎంకే ప్రభుత్వం అవినీతికి పాల్పడింది.. విజయ్ తో ఎందుకు పెట్టున్నామా అని తలచుకుని తలచుకుని బాధపడుతారు.. ఆ రోజు త్వరలోనే వస్తుంది అని టీవీకే చీఫ్ పేర్కొన్నారు.
Tamil Nadu Politics: కరూర్ తొక్కిసలాట జరిగిన కొన్ని రోజుల తర్వాత దక్షిణాది సూపర్ స్టార్ విజయ్ పార్టీని బీజేపీ సంప్రదించిందని రాజకీయ వర్గాలు తెలిపాయి. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తన అవకాశాలను మెరుగుపరుచుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని చెబుతున్నారు. డీఎంకే అన్యాయంగా విజయ్‌ను లక్ష్యంగా చేసుకుందని.. విజయ్ ఒంటరి కాదని బీజేపీ సీనియర్ నాయకుడు తమిళగ వెట్రి కజగం (టీవీకే) నాయకత్వానికి తెలియజేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మరోవైపు.. డీఎంకేను ఇరుకున పెట్టాలని బీజేపీ టీవీకేకి…
TVK Rally Stampede: తమిళ స్టార్ ,టీవీకే పార్టీ అధినేత విజయ్ నిర్వహించిన ర్యాలీ తీవ్ర విషాదాన్ని నింపింది. కరూర్‌లో శనివారం జరిగిన ర్యాలీలో తొక్కిసలాట జరిగి 40 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన రాజకీయం విమర్శలు ప్రతివిమర్శలకు కారణమవుతోంది. తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి. విజయ్ ర్యాలీలో విద్యుత్ అంతరాయం, అకాస్మత్తుగా జనసమూహం, ఇరుకైన స్థలం కారణంగా ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
Stampede: తమిళనాడు కరూర్‌లో శనివారం జరిగిన తొక్కిసలాట ఘటనపై టీవీకే అధినేత విజయ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా, అధికార డీఎంకే పార్టీ నేతలు విజయ్‌పై విరుచుకుపడుతున్నారు. పోలీసు నిబంధనలు పాటించలేదని, మార్గదర్శకాలను ఉల్లంఘించారని మండిపడుతున్నారు. ఈ విషాద ఘటనలో 40 మంది చనిపోయారు, 100 మందికి పైగా గాయపడ్డారు.