ఇంటిల్లిపాది ఎంతో సందడిగా ఆనందంతో చేసుకునే దీపావళి పండుగకు వేళైంది. అమావాస్య చీకట్లను తరిమికొట్టి జీవితంలో వెలుగు జిలుగులు నింపే సంతోషాల సంబరం వచ్చేస్తోంది. అక్టోబర్ 20న దీపావళిని జరుపుకోనున్నారు. దీపావళి పండుగ ఆనందం, శ్రేయస్సు, ఐశ్వర్యం, కీర్తి, లక్ష్మీదేవి రాకను సూచిస్తూ చేసుకునే పండుగ. లక్ష్మీదేవిని సంపదకు పూజనీయమైన దేవతగా భావిస్తారు. ఏటా ఆశ్వయుజ మాసం కృష్ణపక్ష అమావాస్య నాడు జరుపుకొనే దీపావళి పండుగ రోజున భక్తిశ్రద్ధలతో లక్ష్మీదేవినీ ఆరాధిస్తాం. అమ్మవారిని ఎలా పూజించాలో ఇప్పుడు…