Lakshmi Puja: ఇంటిల్లిపాది ఎంతో సందడిగా ఆనందంతో చేసుకునే దీపావళి పండుగకు వేళైంది. అమావాస్య చీకట్లను తరిమికొట్టి జీవితంలో వెలుగు జిలుగులు నింపే సంతోషాల సంబరం వచ్చేస్తోంది. అక్టోబర్ 20న దీపావళిని జరుపుకోనున్నారు. దీపావళి పండుగ ఆనందం, శ్రేయస్సు, ఐశ్వర్యం, కీర్తి, లక్ష్మీదేవి రాకను సూచిస్తూ చేసుకునే పండుగ. లక్ష్మీదేవిని సంపదకు పూజనీయమైన దేవతగా భావిస్తారు. ఏటా ఆశ్వయుజ మాసం కృష్ణపక్ష అమావాస్య నాడు జరుపుకొనే దీపావళి పండుగ రోజున భక్తిశ్రద్ధలతో లక్ష్మీదేవినీ ఆరాధిస్తాం. అమ్మవారిని ఎలా పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
READ MORE: Alluri District: అరకులోయలో తప్పిన పెను ప్రమాదం.. పట్టాలపై జారిపడ్డ భారీ బండరాయి..
దీపావళి సందర్భంగా మహాలక్ష్మి దేవిని సరైన సమయంలో, సరైన పద్ధతిలో, సక్రమమైన ఆచార వ్యవహారాలతో పూజిస్తే ఆ సంవత్సరం సర్వతోముఖంగా సుభిక్షంగా ఉంటుంది. మీరు పూజకు ఎంచుకునే లక్ష్మీ దేవి విగ్రహాన్ని లేదా చిత్రాన్ని తీసుకువచ్చినప్పుడల్లా అది కమలం లేదా ఏనుగు మీద కూర్చోవాలని గుర్తుంచుకోండి. సంపద, శ్రేయస్సుకు దేవతగా చెప్పుకునే లక్ష్మీని పూజించేటప్పుడు కొన్ని నియమాలు ఉన్నాయి. సాయంత్రం వేళలో పూజ ప్రారంభించాలి. దీపావళి ప్రతి పూజలోనూ వినాయకుడిని ఆరాధించడం సంప్రదాయం. దీపావళి పండుగ రోజు లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి ముందు ఇంటిని శుభ్రం చేసి రంగవల్లులతో, పూలతో, దీపాలతో అలంకరించాలి. అనంతరం పూజగదిలో ఈశాన్య దిశలో పీఠం ఏర్పాటు చేసి ఎర్రటి వస్త్రాన్ని వేయాలి. దీనిపై గణపతి, లక్ష్మీదేవి విగ్రహాలను ఉంచాలి. ఇప్పుడు పీఠంపై కలశాన్ని ఏర్పాటు చేయాలి. దీపాలు వెలిగించాలి. పూలు, పండ్లు, స్వీట్లు, పిండి వంటలు వంటివి నైవేద్యంగా సమర్పించాలి. మొదట గణపతి పూజ చేసి.. ఆ తర్వాత లక్ష్మీదేవిని పూజించాలి.
READ MORE: Lenin: అఖిల్ ‘లెనిన్’లో సర్ప్రైజ్ గెస్ట్ రోల్ – సీనియర్ హీరోతో పవర్‌ఫుల్ క్లైమాక్స్