దీపావళి పండుగను భారతదేశంలో వైభవంగా జరుపుకుంటారు. హిందూ మతంలో దీపావళి పండుగకు చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున గణేశుడిని, లక్ష్మి దేవిని పూజిస్తారు. దీనితో పాటు ప్రజలు తమ ఇళ్లలో దేవాలయాల్లో దీపాలు వెలిగిస్తారు. భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని వివిధ దేశాల్లో కూడా దీపావళి పండుగను ఘనంగా నిర్వహిస్తారు. అయితే... దీపావళి పండుగను భారతదేశంలో పలు ప్రాంతాల్లో జరుపుకోరు. అక్కడ పటాకులు కూడా కాల్చరు.