Divya Pahuja: మాజీ మోడల్ దివ్య పహుజా కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. హర్యానాలోని ఓ హోటల్ గదిలో ఆమెను హత్య చేసి, డెడ్‌బాడీని ఈడ్చుకెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే నిందితులు డెడ్‌బాడీని ఎక్కడ పారేశారనే విషయంపై పోలసీులు గత కొన్ని వారాలుగా వెతుకుతున్నారు. చివరకు ఓ కాలువలో కుళ్లిపోయిన స్థితితో దివ్యపహుజా మృతదేహం లభ్యమైంది. ఆమెను హత్య చేసిన తర్వాత పొరుగున ఉన్న పంజాబ్‌లోని కాలువలో పడేసినట్లు పోలీసులు గుర్తించారు.
మాజీ మోడల్ దివ్య పహుజా హత్యకు గురైన గురుగ్రామ్ హోటల్ నుంచి ఆమె మృతదేహాన్ని తరలించేందుకు ఉపయోగించిన బీఎండబ్ల్యూ కారు పంజాబ్‌లోని పాటియాలాలో దొరికింది. కారు లాక్ చేయబడి ఉంది. కారులో దివ్య మృతదేహం ఉందో లేదో పోలీసులు ఇంకా ధృవీకరించలేదు.
Divya Pahuja: గురుగ్రామ్ హోటల్‌లో మాజీ మోడల్, గ్యాంగ్‌స్టర్ ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్ దివ్య పహుజా హత్యకు గురైంది. హోటల్ యజమాని, అతని సహచరులు హత్య చేశారని పోలీసులు తెలిపారు. ఈ హత్య ఉదంతం, నిందితులు అక్కడ ఉన్న సీసీటీవీలో రికార్డ్ అయ్యారు. బీఎమ్‌డబ్ల్యూ కారులో మృతదేహాన్ని తీసుకెల్లి గుర్తు తెలియని ప్రదేశంలో పడేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె మృతదేహం ఇంకా లభ్యం కాలేదు. హత్యకు కారణం ఇంకా తెలియరాలేదు. దివ్యపహుజా మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ సందీప్ గడోలీ…
గురుగ్రామ్‌లోని ఓ హోటల్‌లో 27 ఏళ్ల మోడల్ దివ్య పహుజా హత్య ఆ ప్రాంతంలో సంచలనం సృష్టించింది. దివ్య పహుజా బల్దేవ్ నగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నట్లు తెలిసింది. సంచలనం సృష్టించిన హత్య కేసులో ఢిల్లీకి చెందిన అభిజీత్ అనే వ్యాపారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు