హిందూపురం గ్యాంగ్ రేప్‌పై మాజీ మంత్రి, శ్రీ సత్యసాయి జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షురాలు ఉషా శ్రీ చరణ్ స్పందించారు. ఇద్దరు మహిళలపై గ్యాంగ్‌రేప్ అత్యంత దుర్మార్గం, విజయదశమి రోజు స్త్రీని పరాశక్తిగా కొలిచే ఈ దేశంలో ఇలాంటి ఘటన జరగడం చాలా బాధాకరమన్నారు.
శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు నల్లబొమ్మనిపల్లిలో అత్తాకోడలిపై అత్యాచార ఘటనపై హోం మంత్రి అనిత సీరియస్ అయ్యారు. అత్యారానికి పాల్పడిన దుండగులను సత్వరమే అరెస్ట్ చేయాలని ఆదేశించారు.
శ్రీసత్యసాయి జిల్లాలో గ్యాంగ్ రేప్ ఘటనపై జిల్లా ఎస్పీతో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఘటనపై దర్యాప్తు వివరాలు తెలుసుకున్నారు. వాచ్ మెన్, అతని కొడుకును కత్తులతో బెదిరించి అత్త, కోడలిపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలిసింది.
జన్మనిచ్చిన తల్లిదండ్రులలే కొందరు భారంగా భావిస్తున్నారు.. కనీసం వారికి తిండి పెట్టి, బాగోగులు కూడా చూసుకోకుండా ఇళ్ల నుంచి వెళ్లగొడుతున్నారు.. వారు జీవితంలో సంపాదించింది, ఆస్తులు లాగేసుకోవడమే కాదు.. మమ్మల్ని కన్నారు, పెంచి పెద్దచేశారు, విద్యాబుద్ధులు నేర్పారు, వారిని మేం చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారు? అనే జ్ఞానం కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఇంకా కొందరైతే చిత్రహింసలకు గురిచేసిన ఘటనలు ఎన్నో చూశాం.. ఇలాంటి పరిస్థితుల్లో జీవించడమే వ్యర్థమని ఇప్పటికే ఎంతో మంది పండుటాకులు రాలిపోయారు, ఆత్మహత్యలకు పాల్పడ్డారు..…